21. సమకాలీన సామాజిక ఉద్యమాలు
I. సరియైన జవాబు గుర్తించుము.
1. ఒక సమస్యను ఎంచుకొని, దాంట్లో మార్పు తీసుకురావలన్న ఉద్దేశ్యంతో మొదలైనది.
A) యుద్ధం
B) ఉద్యమం
C) సంధి
D) చర్చలు
2. 1960 సం||లో జరిగిన పౌరహక్కుల ఉద్యమం ఏ దేశంలో జరిగింది.
A) రష్యా
B) ఫ్రాన్స్
C) అమెరికా
D) బ్రెజిల్
3. పౌరహక్కుల ఉద్యమ నాయకుడు
A) రూజ్ వెల్ట్
B) అలెగ్జాండర్ సోల్ట్ నిత్సిన్
C) డా. మార్టిన్ లూథర్ కింగ్
D) ఆండ్రే సఖరోవ్
4. రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసిన దేశం
A) ఫ్రాన్స్
B) చైనా
C) అమెరికా
D) బ్రిటన్
5. వియత్నాంలో యుద్ధం చేసిన దేశం
A) రష్యా
B) అమెరికా
C) జర్మనీ
D) బ్రిటన్
6. ‘నర్మదా బచావో’ ఉద్యమ నాయకురాలు
A) సీతమ్మ
B) మేథాపాట్కర్
C) ఇరోంషర్మిలా
D) తంగజంమనోరమ
7. సారాయిని నిషేధించిన సంవత్సరం
A) 1992
B) 1993
C) 1994
D) 1995
8. సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైనది
A) ఏటికొప్పాక
B) దూబగుంట
C) పిచ్చుకల గుంట
D) దిన్న దేవరపాడు
9. మైరా పైబీ ఉద్యమంలో మహిళలు ఉపయోగించినవి
A) తుపాకులు
B) కత్తులు
C) గొడ్డళ్లు
D) కాగడాలు
10. మణిపూర్ ను భారతదేశంలో విలీనం చేసిన సంవత్సరము
A) 1948
B) 1949
C) 1950
D) 1951
II. ఖాళీలను పూరింపుము.
1. ‘నా కొక కల ఉంది’ అన్న చారిత్రత్మాక ఉపన్యాసం చేసిన వారు ___________.
2. రష్యా అధ్యక్షుడు గోర్బచెవ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు
3. ‘గ్రీన్ పీస్’ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం _________.
4. ‘సైలెంట్ వ్యాలీ’ ఉద్యమం __________ రాష్ట్రానికి చెందినది.
5. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన సంవత్సరం
6. “సెంటర్ ఫర్ సైన్స్ & ఎన్విరాన్మెంట్” స్థాపించినది
7. సంపూర్ణ మద్యపాన నిషేధ చట్టం చేయబడినది
8. మైరా పైబీ ఉద్యమం మొదలయిన సంవత్సరం __________
9. మైరా పైబీ ఉద్యమంలో గృహ నిర్బంధంలో ఉన్న మహిళ ___________
10. సైలెంట్ వ్యాలీని జాతీయ పార్కుగా ప్రకటించింది __________