PAPER – II
13. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం
1900-1950: భాగం -1
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. 20వ శతాబ్దపు ఆరంభంలో యూరప్లో పారిశ్రామికంగా అగ్రగామిగా ఉన్న దేశం
A) ఫ్రాన్స్
B) జర్మనీ
C) ఇటలీ
D) బ్రిటన్
2. ప్రపంచంలో “తీవ్ర ఆర్థిక మాంద్యం” సంభవించిన సంవత్సరం
A) 1927
B) 1928
C) 1929
D) 1931
3. అంతర్జాతీయ ‘మహిళల ఓటుహక్కు’ ఉద్యమ సంస్థ ఏర్పడిన సంవత్సరం
A) 1914
B) 1915
C) 1917
D) 1918
4. మొదటి ప్రపంచ యుద్ధ కాలము
A) 1939 – 45
B) 1914 – 18
C) 1918 – 24
D) ఏదీకాదు
5. హిట్లర్ రష్యాపై దాడి చేసిన సంవత్సరము
A) 1942
B) 1943
C) 1939
D) 1944
6. కేంద్ర రాజ్యాల కూటమికి నాయకత్వం వహించిన దేశం
A) ఆస్టియా
B) ఇటలీ
C) బ్రిటన్
D) జర్మనీ
7. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తేది
A) 1939 జూన్, 1
B) 1914 జూన్, 28
C) 1939 సెప్టెంబర్, 1
D) 1939 ఆగష్టు, 1
8. యు.ఎస్. ఎస్.ఆర్. (USSR) ఏర్పడిన సంవత్సరం
A) 1922
B) 1923
C) 1924
D) 1925
9. మొదటి ప్రపంచ యుద్ధం ఈ సంధితో ముగిసింది. ( )
A) వర్సయిల్స్
B) సెవెర్స్
C) రహస్య సంధి
D) ఏదీకాదు
10. మిత్రదేశాల కూటమిలో లేని దేశం
A) రష్యా
B) ఫ్రాన్స్
C) జర్మనీ
D) బ్రిటన్
11. బిస్మార్క్ 1882లో ఈ దేశంతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. ( )
A) ఆస్ట్రియా
B) రష్యా
C) హంగరీ
D) ఇటలీ
12. బ్రిటిష్ మహిళలకు ఓటు హక్కు లభించిన సం||
A) 1915
B) 1916
C) 1917
D) 1918
13. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన శాంతి సంస్థ
A) నానాజాతి సమితి
B) ప్రపంచ ఆరోగ్య సంస్థ
C) ఐక్యరాజ్య సమితి
D) అంతర్జాతీయ కార్మిక సంస్థ
14. రష్యాలో కమ్యూనిష్టు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం
A) 1914
B) 1917
C) 1918
D) 1922
15. రెండవ ప్రపంచ యుద్ధ కాలం
A) 1914 – 18
B) 1924 – 28
C) 1939 – 45
D) ఏదీకాదు
II. ఖాళీలను పూరింపుము.
1. 20వ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ జనాభా _________ కోట్లు.
2. ప్రపంచమంతటా విశాల సామ్రాజ్యాలను ఏర్పాటు చేసిన దేశం
3. చరిత్రకారుడైన ఎరిక్ హబ్స్ బామ్ 20వ శతాబ్దాన్ని ________ యుగంగా పేర్కొన్నాడు.
4. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరుపున పోరాడి ఆఫ్రికా, యూరప్ లో చనిపోయిన భారతీయ సైనికుల సంఖ్య ____________.
5. ప్రపంచ యుద్ధ ప్రారంభంలో ఆస్ట్రియా __________ దేశంపై యుద్ధం చేసింది.
6. రెండవ ప్రపంచ యుద్ధాల మధ్య కాల వ్యవధి _________ సంవత్సరాలు.
7. రష్యా విప్లవం జరిగిన సంవత్సరము ___________
8. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా వేసిన అణుబాంబు వల్ల దెబ్బతిన్న జపాన్ నగరాలు _________ & ________
9. రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా హోలోకాలో నాజీల చేతిలో చనిపోయిన ‘యూదుల’ సంఖ్య __________.
10. జర్మనీలో నాజీ పార్టీ స్థాపకుడు ________
11. జర్మనీ, రష్యాలు పరస్పరం దండెత్తకుండా ఉండటానికి __________ సంవత్సరములో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
12. రెండవ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వాళ్ళలో అధిక శాతం పురుషులు __________ సంవత్సరాల లోపువారు.
13. యునిసెఫ్ (UNICEF) ని విస్తరింపుము .
14. నానాజాతి సమితి ఏర్పడంలో చురుకైన పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు ________
15. 1934లో నానాజాతి సమితిలో ఉన్న సభ్యుల సంఖ్య _______
16. వర్సయిల్స్ శాంతి ఒప్పందం జరిగిన సంవత్సరం _____________
17. నానాజాతి సమితిలోకి __________ మరియు __________ దేశాలను ఆహ్వానించలేదు.