14. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం
1900-1950:
భాగం – II
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలో కెల్లా అతి పెద్ద సైన్యం ఈ దేశానికి ఉండేది ?
A) అమెరికా
B) జర్మనీ
C) రష్యా
D) బ్రిటన్
2. రష్యాలో తీవ్ర కరవు సంభవించిన కాలం
A) 1914 – 18
B) 1929 – 30
C) 1935 – 36
D) 1924 – 25
3. “రష్యాలో సోవియట్లు” అనగా
A) సంఘాలు
B) సైన్యం
C) కార్మికులు
D) ఏదీకాదు
4. రష్యా రాచరిక వాదుల సైన్యం పేరు
A) నల్లసైన్యం
B) పసుపు సైన్యం
C) తెల్ల సైన్యం
D) ఏదీకాదు
5. రష్యాలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టినవాడు
A) లెనిన్
B) స్టాలిన్
C) కెరెన్ స్కీ
D) జాలు
6. తీవ్ర మాంద్యానికి గురికాని దేశం
A) రష్యా
B) జర్మనీ
C) ఫ్రాన్స్
D) అమెరికా
7. రక్తసిక్త ఆదివారం విప్లవం ఈ సంవత్సరంలో జరిగింది.
A) 1901
B) 1902
C) 1904
D) 1905
8. తీవ్రమాంద్యం వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశం ఏది ? ( )
A) బ్రిటన్
B) రష్యా
C) ఇటలీ
D) జర్మనీ
9. ” ఏపని చెయ్యటానికైనా సిద్ధం” అని రాసి ఉన్న కార్డులు తగిలించుకొని పురుషులు ఈ దేశంలో కనపడేవారు. ( )
A) జర్మనీ
B) ఐర్లాండు
C) నార్వే
D) బ్రిటన్
10. జర్మన్ పార్లమెంటు పేరు ________
A) కాంగ్రెస్
B) డైట్
C) సెనేట్
D) రీచ్ స్టాగ్
11. రష్యాలో ‘పౌరయుద్ధ’ కాలము __________
A) 1918 – 20
B) 1850 – 55
C) 1919 – 20
D) ఏదీకాదు
12. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిష్టు విప్లవాన్ని ప్రోత్సహించటానికి ఏర్పడిన “కమ్మిటర్న్” అన్న అంతర్జాతీయ సంస్థలో ముఖ్యపాత్ర పోషించిన భారతీయుడు
A) ఠాగూర్
B) రాధాకృష్ణన్
C) M. N. రాయ్
D) నెహ్రూ
13. 1937 నాటికి జర్మనీలో నాజీ పార్టీ సాధించిన ఓట్ల శాతం _______.
A) 2.6%
B) 6.2%
C) 37%
D) 73%
14. హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్ అయిన తేది ( )
A) 1918 నవంబర్ 9
B) 1939 సెప్టెంబర్ 1
C) 1933 జనవరి 30
D) 1933 డిశంబర్ 8
15. ‘కాన్సంట్రేషన్ క్యాంపులు’ అనగా _________ ( )
A) శిక్షా శిబిరాలు
B) ఆయుధ కర్మాగారాలు
C) సైనిక శిబిరాలు
D) శాంతి శిబిరాలు
16. ఏ వయస్సు మగ పిల్లలందరికీ జర్మనీలో నాజీ సిద్ధాంతంలో ప్రాథమిక శిక్షణ యిచ్చేవారు
A) 3 – 6 సం||లు
B) 5 – 8 సం||లు
C) 10-12 సం||లు
D) 6-10 సం||లు
17. నాజీ పార్టీ యొక్క గుర్తు
A) నక్షత్రం
B) స్వస్తిక్
C) ఐరన్ క్రాస్
D) ఏనుగు
18. ‘ఎనేల్లీగ్ యాక్టు’ ను రూపొందించిన సం||
A) 1933
B) 1934
C) 1932
D) 1936
19. ‘ది హిస్టరీ ఆఫ్ ఎ సోవియట్ కలెక్టివ్ ఫాం” గ్రంథకర్త ( )
A) M.N. రాయ్
B) షాకత్ ఉస్మాని
C) ఫెడార్ బౌలోవ్
D) ఏదీకాదు
20. ప్రపంచమంతా ఉపయోగిస్తున్న క్యాలెండర్ ________ ( )
A) జలియన్ క్యాలెండర్
B) గ్రెగొరియన్ క్యాలెండర్
C) రష్యన్ క్యాలెండర్
D) ఇంగ్లీష్ క్యాలెండర్
II. ఖాళీలను పూరింపుము.
1. రష్యన్ పాలించిన చివరి రాజు _______.
2. రష్యాలో 10 వేల మంది మహిళలు ‘రొట్టె’ శాంతి కోసం ఊరేగింపు జరిపిన నగరం _________.
3. లెనిన్ చనిపోయిన సంవత్సరం
4. రష్యాలో ___________ పట్టణంలో మూడు సంవత్సరాలలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించారు.
5. ఐరోపాలోని ఇతర రాజధానులతో పోలిస్తే “మాస్కో” అంత శుభ్రంగా అనిపించదు అని వ్రాసిన భారతీయుడు ___________
6. ఆర్థిక సంక్షోభం కారణంగా ఐరోపాలో పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లు ముద్రించిన దేశం _________
7. జర్మనీలో ఆర్థిక పున:నిర్మాణ బాధ్యతను హిట్లర్ __________ కి అప్పగించాడు.
8. జి.డి.ఆర్ (G.D.R.) అనగా __________
9. అమెరికా, తూర్పు ప్రాంతంలో హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు వేయడంతో _______ దేశం లొంగిపోయింది.
10. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్ ఆర్థిక పరిస్థితి కుప్పకూలటంతో వాటి పున: రుద్దరణకు అమెరికా ప్రవేశపెట్టిన ప్రణాళిక ____________
11. జపాన్ పార్లమెంట్ ని __________ అంటారు.
12. ఎస్.ఆర్.జి. (F.R.G.) అనగా __________
13. తీవ్ర మాంద్యం వలన అమెరికాలో నిరుద్యోగులు _________ శాతానికి పెరిగారు.
14. ‘న్యూఢీల్’ లేదా ‘కొత్త ఒప్పందాన్ని’ ప్రవేశపెట్టిన అమెరికా అధ్యక్షుడు
15. రష్యాలో లోరెంజ్ టెలిఫోన్ కర్మాగారంలో విజయవంతమైన సమ్మెకు ఒంటరిగా పిలుపు నిచ్చినవారు _________
15. వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు __________