17. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. భారత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగిన సం||
A) 1935
B) 1939
C) 1946
D) 1942
2. రాజ్యాంగ ముసాయిదా సంఘం నాయకుడు ( )
A) డా|| రాజేంద్రప్రసాద్
B) సరోజినీ నాయుడు
C) డా||బి.ఆర్. అంబేద్కర్
D) దుర్గాబాయ దేశ్ ముఖ్
3. భారత సమాఖ్య అధిపతి ,( )
A) ప్రధానమంత్రి
B) రాష్ట్రపతి
C) ప్రధాన న్యాయమూర్తి
D) గవర్నర్
4. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఈ భాగంలో ఉన్నాయి.( )
A) ఒకటవ
B) రెండవ
C) మూడవ
D) నాల్గవ
5. యూదుల అణచివేత ఈ దేశంలో జరిగింది.
A) జర్మనీ
B) జపాన్
C) ఇటలీ
D) పోలెండ్
6. కొత్త రాజ్యాంగ సవరణలను వీరు ఆమోదించాలి.
A) ప్రధానమంత్రి
B) రాష్ట్రపతి
C) సుప్రీంకోర్టు
D) మంత్రులు
7. అమెరికా ప్రభుత్వం ఈ విధమైన వ్యవస్థ కలిగినది.
A) ప్రజాస్వామ్య వ్యవస్థ
B) పార్లమెంటరీ వ్యవస్థ
C) సైనిక వ్యవస్థ
D) అధ్యక్ష వ్యవస్థ
8. ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న అధికరణాలు, షెడ్యూళ్ళ సంఖ్య ( )
A) 315, 8
B) 320, 9
C) 325, 10
D) 310, 7
9. నేపాల్ రాజ్యాంగం ప్రారంభించబడిన సం||
A) 2000
B) 2002
C) 2005
D) 2007
10. రాజ్యాంగంలోని ప్రభుత్వ విధానాలకు ఇవి ఉన్నాయి.
A) ప్రాథమిక హక్కులు
B) ప్రాథమిక విధులు
C) ఆదేశిక సూత్రాలు
D) నైతిక విధులు
11. రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం కలవారు
A) కేంద్రం
B) మండలం
C) రాష్ట్రాలు
D) గ్రామాలు
II. ఖాళీలను పూరింపుము.
1. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సుమారు _________ రోజులకు ముసాయిదా సంఘాన్ని ఏర్పాటు చేశారు.
2. రాజ్యాంగ సభ ముందుగా _________ , ________ , ________ వంటి ముఖ్యాంశాలపై ప్రత్యేక సంఘాలను నియమించింది.
3. బ్రిటీషు ప్రభుత్వం చేసిన _________ అంశాలను కూడా ముసాయిదా తీసుకుంది.
4. భారత అధ్యక్షుడు __________ సలహాలను పాటించేలా రాజ్యాంగ సభ రూపొందించింది.
5. స్వదేశీ సంస్థానాల నుండి రాజ్యాంగ సభకు ఎన్నికైనవారు ________ మంది.
6. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేది _______.
7. __________ జాబితా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి.
8. భారత రాజ్యాంగం ___________ పౌరసత్వాన్ని కల్పించింది.
9. భారతదేశంలో ఉన్నత న్యాయస్థానం ________
10. భారతదేశంలో _________ న్యాయవ్యవస్థ అమలులో ఉంది.
11. కేబినెట్ మిషన్ ఏర్పాటయిన సం|| ___________
12. పరిపాలనలో అధ్యక్షుని స్థానం __________.
13. ఉమ్మడి జాబితాలో __________ అంశాలు ఉన్నాయి.
14. సామాజిక న్యాయం పెంపొందించడానికి _________ తోడ్పడతాయి.
15. రాజ్యాంగ సభ అధ్యక్షులు _______