18. నేను నీతో “నేను రాను” అని చెప్పాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) అతనితో తాను రానని చెప్పుకున్నాడు
B) నేను నీతో రానని చెప్పాడు
C) తనతో నేను రానన్నాడు
D) వానితో నేను రానన్నాడు
19. అడవులను నరకవద్దు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) ధాత్వర్థక వాక్యం
B) నిశ్చయార్థక వాక్యం
C) నిషేధార్థక వాక్యం
D) హేత్వర్థక వాక్యం
20. బాగా చదివి ఉండడం వల్ల మార్కులు వచ్చాయి – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సందేహార్థక వాక్యం
B) హేత్వర్థక వాక్యం
C) అవ్యక వాక్యం
D) నిశ్చయార్థక వాక్యం
21. నాయనా ! చిరకాలం వర్థిల్లు – ఇది ఏ రకమైన వాక్యం ? ”
A) హేత్వర్థక వాక్యం
B) అభ్యర్థక వాక్యం
C) నిశ్చయార్థక వాక్యం
D) ఆశీర్వచనార్థక వాక్యం
22. ‘ఆయన డాక్టరా ? ప్రొఫెసరా ?’ – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.
A) సంక్లిష్ట వాక్యం
B) సామాన్య వాక్యం
C) సంయుక్త వాక్యం
D) అప్యర్థక వాక్యం