8. కాశీలోని స్త్రీలు అతిథులకు అర్హ్యపాద్యాలు ఇచ్చి భోజనం పెట్టేవారు. గీత గీసిన పదానికి విగ్రహవాక్యం ( )
A) అర్ఘ్యము అనెడి పాద్యం
B) అర్ఘ్యము మరియు పాద్యము
C) అర్ఘ్యము కొరకు పాద్యము
D) అర్ఘ్యమైన పాద్యము
3. గణ విభజన
1. “మునివర నీవు శిష్య గణముంగొని చయ్య సరమ్ము విశ్వనా” ఇది ఏ పద్యపాదం ?
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) మత్తేభం
D) శార్దూలం
2. “వేదోక్త శివధర్మ వీధి బసవనికి” – ఇది ఏ పద్యపాదం ?
A) తేటగీతి
B) ఆటవెలది
C) ద్విపద
D) కందం
3. “య్యాదిమ శక్తి, సంయమివరా ! యిటు రమ్మనిపిల్చె హస్తసం” – ఇది ఏ పద్యపాదం ?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) తేటగీతి
D) ఆటవెలది
4. “ఆకంఠంబుగ నిష్ణు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా” ఇది ఏ పద్యపాదమో గుర్తించండి.
A) తేటగీతి
B) ఆటవెలది
C) శార్దూలం
D) మత్తేభం