7. నాటి యట్ల ముక్కంటిమాయ నే మచ్చెకంటియు వంటకంబు పెట్టకున్న గటకటంబడి – ఇందులోని అలంకారం ( )
A) రూపకం
B) ఉత్ప్రేక్ష
C) స్వభావోక్తి
D) వృత్త్యనుప్రాస
8. ‘ఇందు బింబాస్య యెదురుగా నేగుదెంచి’ ఇందలి అలంకారం ( )
A) రూపకం
B) ఉపమాలంకారం
C) ఉత్ప్రేక్ష
D ) స్వభావోక్తి
9. ‘చెడుగాక మోక్షలక్ష్మి’ ఇందలి అలంకారం
A) రూపకాలంకారం
B) వృత్త్యనుప్రాస
C) యమకం
D) ఉత్ప్రేక్ష
10. భగీరధుడు గంగను భూమిపైకి తెచ్చాడు. గొప్పవారు ఎంతటి కష్టమైన పనినైనా సాధిస్తారు గదా ! ఈ వాక్యంలోని అలంకారం గుర్తించండి ?
A) రూపకం
B) ఉత్ప్రేక్ష
C) అర్థాంతరన్యాసాలంకారం
D) యమకం
5. వాక్య పరిజ్ఞానం
1. వ్యాసుడు కాశీనగరంబునకు చనియె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) వ్యాసుడు కాశీ నగరానికి వెళ్ళాడు
B) కాశీ నగరంబునకు వెళ్ళే వ్యాసుడు
C) చనెను వ్యాసుడు కాశీ నగరంబున
D) వ్యాసుడు కాశీపట్టణంబునకు వెళ్ళియుండెను