12. తనకు కోపమెక్కువని వ్యాసుడు పలికాడు – దీనిని ప్రత్యక్ష కథనంలోకి మార్చండి. ( )
A) అతనికి కోపం ఎక్కువ అని వ్యాసుడు పలికాడు
B) వానికి కోపం తక్కువ అని వ్యాసుడు అన్నాడు
C) వానికి కోపం ఎక్కువ అని వ్యాసుడు అన్నాడు
D) నాకు కోపం ఎక్కువ అని వ్యాసుడు అన్నాడు
13. “నాకు చదువును చెప్పు” అని శిష్యుడు అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) వానికి చదువును చెప్పమని శిష్యుడు అన్నాడు
B) చెప్పమన్నది చదువని శిష్యుడు అన్నాడు
C) తనకు చదువు తప్పక చెప్పాలని శిష్యుడు అన్నాడు
D) తనకు చదువును చెప్పమని శిష్యుడు అన్నాడు
14. ‘నాకు భిక్ష సమర్పించు’ అని వ్యాసుడు అర్థించాడు. – దీనికి పరోక్ష కథన వాక్యం గుర్తించండి.
A) నేను భిక్షను అర్థించానని వ్యాసుడు చెప్పాడు
B) తనకు భిక్ష సమర్పించుమని వ్యాసుడు అర్థించాడు
C) వానికి భిక్షను అర్పించాలని కోరాడు వ్యాసుడు
D) అతనికి భిక్ష సమర్పించాలని వ్యాసుడు కోరాడు
15. “మీరందరూ తెలివైన విద్యార్థులే ! బాగా చదవండి”. అని . అన్నారు డి.ఇ.ఓ గారు – పరోక్ష కథనం గుర్తించండి. ( )
A) మీరంతా బాగా చదివితే తెలివైనోళ్ళనని డి.ఇ.ఓ. అన్నారు
B) తామంతా బాగా చదివినప్పుడు తెలివైనోళ్ళు అని డి.ఇ.ఓ గారన్నారు
C) తామందరమూ తెలివైన విద్యార్థులమేననీ, బాగా చదవాలనీ డి.ఇ.ఓ. గారన్నారు
D) మీరందరూ తెలివైన విద్యార్థులేనని, బాగా చదవండని అన్నారు డి.ఇ.ఓ. గారు
16. నిన్న జోరుగా వర్షం కురిసింది. (వ్యతిరేక వాక్యం గుర్తించండి. )
A) నిన్న జోరుగా వర్షం కురవలేదు
B) నిన్న నెమ్మదిగా వర్షం కురిసింది
C) హెచ్చుగా నిన్న పడలేదు వర్షం
D) రేపు జోరుగా వర్షం పడొచ్చు