27. సాయి, విజయ అక్కా చెల్లెండ్రు (ఇది ఏ రకమైన వాక్యం ?) ( )
A) సంక్లిష్ట వాక్యం
B) సంయుక్త వాక్యం
C) కర్తరి వాక్యం
D) కర్మణి వాక్యం
28. రామకృష్ణ పరమహంస గురువు. వివేకానందుడు శిష్యుడు – దీనికి సంయుక్త వాక్యం ఏది ? ( )
A) రామకృష్ణ పరమహంస గురువుగా వివేకానందుడు శిష్యుడయ్యాడు.
B) రామకృష్ణ పరమహంస వివేకానందులు గురుశిష్యులు.
C) రామకృష్ణ పరమహంస గురువైతే వివేకానందుడు శిష్యుడు.
D) వివేకానందుడు శిష్యుడైతే రామకృష్ణ పరమహంస గురువుగా ఉన్నాడు.
29. మీరు అల్లరి చెయ్యవద్దు. – ఇది ఏ రకమైన వాక్యం ?
A) తద్ధర్మార్థక వాక్యం
B) విధ్యర్థక వాక్యం
C) అభ్యర్థక వాక్యం
D) హేత్వర్థక వాక్యం
30. అల్లరి చేస్తే శిక్ష తప్పదు – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) అప్యర్థక వాక్యం
B) హేత్వర్థక
C) తద్ధర్మార్థక వాక్యం
D) చేదర్థక వాక్యం
31. భిక్షను కోరుతూ ముందు వెళ్ళాడు. – గీత గీసిన పదం ఏ క్రియా పదం ?
A) క్వార్థం
B) శత్రర్థకం
C) అభ్యర్థకం
D) హేత్వర్ధకం