2. రవి నగరంబునకు చనియె. దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) రవి నగరంలో ఉన్నాడు
B) రవి నగరంబున గనియె
C) రవి నగరానికి వెళ్ళాడు
D) రవి నగరంబులో చనియె
3. ప్రజలు పక్షులను రక్షింపవలె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) ప్రజలు పక్షులను రక్షించాలి
B) ప్రజలెల్లరును రక్షింపవలె పక్షి జాతిని
C) పక్షిజాతిని రక్షింపవలె ప్రజలు
D) రక్షించాలి పక్షులను ప్రజలెల్లరు
4. ‘జీవనార్థము మిక్కిలి యూయాసంపాటు సయితము వ్యర్థము’ (ఆధునిక వచనాన్ని గుర్తించండి) ( )
A) జీవించుటకు ఇంత కష్టము పడటం అవసరమా ?
B) జీవించడానికి మిక్కిలి ఆయాసపడటం దండగ
C) జీవించడానికి ఇన్ని కష్టాలు పడడం దండగకాదు
D) తినడం కోసమే బ్రతకడం వ్యర్థము
5. తల్లి ఆహారం అందించింది. దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) తల్లి కొరకు ఆహారం అందెను
B) అందించెను ఆహారంబు తల్లి
C) తల్లికి ఆహారం అందించబడెను
D) తల్లిచేత ఆహారం అందించబడింది
6. చిత్రగ్రీవం అభ్యసనం చేసింది. దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) చిత్రగ్రీవం నందు అభ్యాసం చేయించెను
B) చేయించబడెను అభ్యాసంబు చిత్రగ్రీవము
C) చిత్రగ్రీవము చేత అభ్యాసం చేయబడింది
D) చిత్రగ్రీవం కొరకు అభ్యాసం చేయబడింది