12. పక్షి పైకి ఎగురగలదు. ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) తద్ధర్మార్థక వాక్యం
B) హేత్వర్థక వాక్యం
C) తుమున్నర్థక వాక్యం
D) సామర్థ్యార్థక వాక్యం
13. వర్షాలు పడితే పంటలు పండుతాయి – ఇది ఏ రకమైన వాక్యం ? ( ).
A) చేదర్థకం
B) విధ్యర్థకం
C) అధిక్షేపకం
D) క్వార్థకం
14. బూర్గులవారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) అనుమత్యర్థకం
B) ప్రశ్నార్థకం
C) కర్మణి
D) కర్తరి వాక్యం
15. ఆహా ! ఎంత బాగుంది ? – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) క్వార్ధకం
B) ఆశ్చర్యార్థకం
C) ప్రేరణార్థకం
D) శత్రర్థకం
16. ‘మీరు లోపలికి రావచ్చు’ – ఇది ఏ రకమైన సామాన్య వాక్యం ? ( )
A) సందేహార్థక వాక్యం
B) విధ్యర్థకం
C) అనుమత్యర్థకం
D) ఆత్మార్థకం
17. కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి. ( )
A) చేదర్థకం
B) శత్రర్థకం
C) క్వార్థం
D) అనుమత్యర్థకం
18. నేటి విద్యార్థులు చక్కటి పౌరులుగా ఎదగగలరు.( )
A) తుమున్నర్థకం
B) సామర్థ్యార్థకం
C) చేదర్థకం
D) విధ్యర్థకం