5. గురువు బడికి వచ్చాడు. గురువు పాఠం చెప్పాడు – దీన్ని సంక్లిష్టవాక్యంగా మారిస్తే ,
A) గురువు బడికి రావాలి, పాఠం బోధించాలి
B) గురువు బడికి వచ్చి పాఠం చెప్పాడు
C) గురువు బడికి వస్తే పాఠం బోధించాలి
D) గురువు బడికి రావడంతో పాఠం చెప్పాడు.
6. కూరలు తెచ్చాడు. కూరలు అమ్మాడు. దీన్ని సంక్లిష్ట వాక్యంగా మారిస్తే
A) కూరలు తెచ్చి అమ్మాడు
B) కూరలు తెస్తూ అమ్మాడు
C) కూరలు తెస్తే అమ్ముతాడు
D) అమ్ముతాడు కూరలు తెస్తే
7. “మా నాన్న గ్రామంలో లేడు” రాజా చెప్పాడు – పరోక్ష కథన వాక్యం ఏది ?
A) రాజా మా నాన్న గ్రామంలో లేడని చెప్పాడు .
B) తమ నాన్న గ్రామంలో లేడని రాజా చెప్పాడు
C) తమ నాన్న గ్రామంలో ఉండడని రాజా చెపాడు
D) వాళ్ళ నాన్న గ్రామంలో లేడని రాజా చెప్పాడు
8. నాకు పల్లెలంటే ఇష్టం అని రైతు అన్నాడు – దీనికి పరోక కథనం గుర్తించండి. –
A) రైతు పల్లెయందు ఇష్టం లేదన్నాడు.
B) తనకు పల్లెలంటే ఇష్టమని రైతు అన్నాడు
C) అతనికి పల్లె యిష్టంగా లేదని రైతు పలికాడు
D) వానికి పల్లెయిష్టం అని రైతు పలికాడు
9. తనకు చాలా ముఖ్యమైన పని యుందని రాము అన్నాడు – దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి.()
A) వానికి ముఖ్యమైన పని ఉందని రాము అన్నాడు
B) ముఖ్యమైన పని నేను చేయాలి అని రాము అన్నాడు
C) “నాకు చాలా ముఖ్యమైనపని ఉంది” అని రాము అన్నాడు
D) “నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను” అని రాము అన్నాడు