10. “నాకు ఏ వ్యసనాలు లేవు” అని రచయిత అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) వ్యసనాలు తనకు ఉండవని రచయిత అన్నాడు
B) రచయితకు వ్యసనాలు ఉండవని అన్నాడు
C) తనకు ఏ వ్యసనాలు లేవని రచయిత అన్నాడు
D) వానికి వ్యసనాలు ఉండవని రచయిత అన్నాడు
11. ‘నీ విషయం పరిశీలింపబడుతుంది’ — ఈ వాక్యానికి కర్తరి వాక్యం ఏది ?
A) నీ విషయం పరిశీలిస్తారు
B) నీ విషయాన్ని పరిశీలిస్తారు
C) నీ విషయమును పరిశీలన ,చేయగలరు
D) నీ విషయం పరిశీలనార్హము
12. ‘దున్నేవానికి భూమిహక్కును ఇచ్చారు’ – దీనికి కర్మణి వాక్యం ఏది ?
A) దున్నేవానిచే భూమి హక్కు ఇవ్వబడింది
B) దున్నేవాడికి భూమిహక్కులు ఇవ్వబడ్డాయి
C) దున్నేవాడికి భూమిహక్కు ఇవ్వబడింది
D) భూమి హక్కులు దున్నేవాడికి ఇస్తారు
13. రైతులు పంటలు పండించారు. ” దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) పండించారు పంటలు రైతులు
B) రైతులచే పంటలు పండించబడినాయి
C) రైతులతో పంటలు పండించబడును
D) రైతులు పండించారు పంటలు
14. లక్ష్మిచే జాబు రాయబడెను – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.
A) లక్ష్మి యొక్క జవాబు రాయబడెను
B) లక్ష్మికి జవాబు రాయించెను
C) రాయించెను జాబు లక్ష్మి
D) లక్ష్మి జాబు రాసింది.