3. “అరటితొక్క తొక్కరాదు” – ఇందలి అలంకారం గుర్తించండి.
A) ఛేకానుప్రాసాలంకారం
B) అంత్యానుప్రాసాలంకారం
C) లాటానుప్రాసాలంకారం
D) ముక్తపదగ్రస్థం
4. తల్లిఒడి వలె పల్లెసీమ లాలిస్తుంది – దీనిలో అలంకారం ఏది?
A) రూపకాలంకారం
B) ఉత్ప్రేక్షాలంకారం
C) వృత్త్యనుప్రాసాలంకారం
D) ఉపమాలంకారం
5. బుడుతడు నడచిన నడకలు తడబడు – దీనిలోని అలంకారం ఏది ?
A) అంత్యానుప్రాస
B) యమకము
C) వృత్యనుప్రాస
D) ఛేకానుప్రాస
6. కింది వానిలో రూపకాలంకారానికి ఉదాహరణ ( )
A) అజ్ఞానం చీకటి వంటిది. దానిని గురువు పోగొడ్తాడు.
B) అజ్ఞానం అనే అంథకారం గురువు వల్ల తొలుగుతుంది.
C) అజ్ఞానాంథకారాన్ని గురువు తొలగిస్తాడు.
D) అజ్ఞానం అంథకారం వలే ఉంటే గురువు తొలగించగలడు.
5. వాక్య పరిజ్ఞానం
1. సూర్యుడు తూర్పున ఉదయించును. ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) విధ్యర్థకం
B) తద్ధర్మార్థకం
C) అప్యకం
D) నిశ్చయాత్మకం