7. రామాయణము వాల్మీకిచే వ్రాయబడింది’ – ఈ కర్మణి వాక్యానికి, కర్తరి వాక్యాన్ని గుర్తించండి. ( )
A) రామాయణము వాల్మీకిచే వ్రాయబడింది
B) వాల్మీకి రామాయణమును వ్రాశాడు
C) రామాయణమును వాల్మీకి వ్రాశాడు
D) వాల్మీకి వలన రామాయణము వ్రాయబడింది
8. ‘ప్రతీ సలహాను పరిశీలిస్తారు’ – ఈ కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి. ”
A) ప్రతీ విషయం చేత పరిశీలిస్తాము
B) ప్రతి సలహా పరిశీలింపబడుతుంది
C) ప్రతి సలహా పరిశీలించారు
D) ప్రతి సలహా పరిశీలిస్తారు
9. నాగార్జునుడు విద్యలను బోధించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి. ( )
A) నాగార్జునుడు విద్యలచే బోధించబడినాయి
B) నాగార్జునునిచే విద్యలు బోధించబడెను
C) విద్యలను బోధించాడు నాగార్జునుడు
D) నాగార్జునుని వల్ల విద్యలు చెప్పబడినాయి
10. ఎన్నో పుస్తకాలు నాచేత రాయబడ్డాయి – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) రాశాను పుస్తకాలు నేనెన్నో
B) పుస్తకాలు నేను రాశాను ఎన్నెన్నో
C) పుస్తకాలచే రాయబడ్డాను నేను
D) నేను ఎన్నో పుస్తకాలు రాశాను
11. “నీకు ఏమి కావాలి ?” అని అతడు ఆమెను అడిగాడు – ఈ ప్రత్యక్ష కథనానికి, పరోక్ష కథనాన్ని గుర్తించండి.
A) ఆమెకు ఏమి కావాలని, అతడు ఆమెను అడిగాడు
B) నాకు ఏమి కావాలని అతడు నన్ను అడిగాడు
C) ‘ఆమెకు ఏమి కావాలి’ అతడు నిన్ను అడిగాడు
D) నీకు ఏమి కావాలని అతడు వానిని అడిగాడు