12. “నీవు నాతో ఇంటికి వస్తున్నావా ?” అతడు అతనిని అడిగాడు – దీని పరోక్ష కథనాన్ని గుర్తించండి. ( )
A) నీవు నాతో ఇంటికి వస్తున్నావని అతడు చెప్పాడు
B) తనతో అతడు ఇంటికి వస్తున్నాడా ? అని అతడు అతనిని అడిగాడు
C) అతడు ప్రశ్నించాడు “నీవు నాతో ఇంటికి రా” అని
D) నేను నీతో ఇంటికి వస్తున్నానా ? అని అతడు ప్రశ్నించాడు
13. శ్రీకాంత్ అన్నం తిన్నాడు. శ్రీకాంత్ బడికి వచ్చాడు – సంక్లిష్ట వాక్యం ఏదో గుర్తించండి. ( )
A) శ్రీకాంత్ అన్నం తిన్నాడు, తిని బడికి రాలేదు.
B) శ్రీకాంత్ అన్నం తిని, బడికి వచ్చాడు.
C) శ్రీకాంత్ అన్నం తిన్నాడు, బడికి వచ్చాడు.
D) శ్రీకాంత్ బడికి వచ్చి అన్న తిన్నాడు.
14. పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు. పర్షియన్ భాషను చదివాడు – సంక్లిష్ట వాక్యం ఏదో గుర్తించండి. ( )
A) పూనాలోని పర్షియన్ చదివి ఫెర్గూసన్ కాలేజీకి వచ్చాడు.
B) ఫెర్గూసన్లో పర్షియన్ చదివాడు.
C) పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరి, పర్షియన్ భాషను చదివాడు.
D) పట్టభద్రుడై ఫెర్గూసన్ లో చేరాడు.
4. కొత్తబాట
PAPER-II: PART – B
1. సంధులు
1. అప్టైశ్వర్యాలు – ఏ సంధి?
A) సవర్ణదీర్ఘసంధి
B) గుణసంధి
C) యణాదేశసంధి
D) వృద్ధి సంధి
2. పొత్తు విల్లు – ఏ సంధి?
A) అత్వసంధి
B) ఇత్వసంధి
C) ఉత్వసంధి
D) గుణసంధి