5. పల్లెలందు పంటలు పండినవి – దీనికి ఆధునిక వాక్యం “గుర్తించండి.
A) పంటలు పల్లెల్లో పండుతాయి
B) పండుతవి పంటలు పల్లెలందు
C) పల్లెల్లో పంటలు పండుతాయి
D) పల్లెల్లో పంటలు పండును
6. రైతులు పంటలు పండించారు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) పంటలతో రైతులు పండించారు
B) రైతులచే పంటలు పండించబడినాయి
C) పండించబడినవి పంటలు రైతులవల్ల
D) రైతులకు పంటలు పండినాయి.
7. ప్రజలచే మొక్కలు నాటబడినాయి. దీనిలో కర్తరి వాక్యం గుర్తించండి,
A) ప్రజలు మొక్కలను నాటారు.
B) ప్రజలవల్ల మొక్కలు నాటబడ్డాయి.
C) ప్రజలతో మొక్కలు నాటబడియుండవచ్చు
D) ప్రజలకు మొక్కలు నాటబడింది.
8. సుమతి సూర్యోదయమును ఆపినది – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) సుమతి సూర్యోదయం ఆపింది
B) సూర్యోదయము సుమతిచేత ఆపబడినది.
C) సూర్యోదయంచేత సుమతి ఆపబడినది
D) సుమతికూడా సూర్యోదయం ఆపింది.
9. శ్రీరామ్ చే జాబు రాయబడెను – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) శ్రీరామ్ యొక్క జవాబు రాయబడెను
B) శ్రీరామ్ జవాబు రాయించెను .
C) రాయించెను జాబు శ్రీరామ్
D) శ్రీరామ్ జాబు రాశాడు