10. పోతన భాగవతం రచించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) రచించాడు భాగవతాన్ని పోతనచేత
B) రచించాడు పోతన భాగవతంతో.
C) పోతనచే భాగవతం రచింపబడెను
D) పోతనకు భాగవతం రచించాడు
11. తనకు పల్లెలంటే ఇష్టమని సోము అన్నాడు. దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి.
A) “నాకు పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు
B) “వానికి పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు
C) “అతనికి పల్లెలంటేనే ఇష్టం” అని సోము చెప్పాడు
D) “నేను పల్లెలంటే ఇష్టపడతాను” అని సోము అన్నాడు
12. “నాకు జీవితంపై ఆశ మెండు” అని కవి అన్నాడు. దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) కవి తనకు ఆశ మెండు జీవితం అని అన్నాడు
B) వానికి జీవితంపై మెండు ఆశయని కవియన్నాడు
C) తనకు జీవితంపై ఆశ మెండని కవి అన్నాడు
D) అతనికి జీవితంపై ఆశ అధికమని చెప్పాడు
13. “మా నాన్న గ్రామంలో లేడు” రాజా చెప్పాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి. ” ( )
A) రాజా మా నాన్న గ్రామంలో లేడని చెప్పాడు
B) తమ నాన్న గ్రామంలో లేడని రాజా చెప్పాడు
C) తమ నాన్న గ్రామంలో ఉండడని రాజా చెప్పాడు
D) వాళ్ళ నాన్న గ్రామంలో లేడని రాజా చెప్పాడు
14. నాకు పల్లెలంటే ఇష్టం అని రైతు అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) రైతు పల్లెయందు ఇష్టం లేదన్నాడు.
B) తనకు పల్లెలంటే ఇష్టమని రైతు అన్నాడు
C) అతనికి పల్లె యిష్టంగా లేదని రైతు పలికాడు
D) వానికి పల్లెయిష్టం అని రైతు పలికాడు