15. తనకు చాలా ముఖ్యమైన పని యుందని రాము అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి. ( )
A) వానికి ముఖ్యమైన పని ఉందని రాము అన్నాడు
B) ముఖ్యమైన పని నేను చేయాలి అని రాము అన్నాడు
C) “నాకు చాలా ముఖ్యమైనపని ఉంది” అని రాము అన్నాడు”
D) “నేను. ముఖ్యమైన పనిలో ఉన్నాను” అని రాము అన్నాడు
16. పల్లెలు వృద్ధి సాధించాయి. దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
A) పల్లెలు వృద్ధి సాధించితీరాలి
B) పల్లెలు వృద్ధి సాధించలేదు
C) పల్లెలు వృద్ధి చెందకూడదు.
D) పల్లెలు వృద్ధి చెందకపోవచ్చు
17. అందరు పల్లెల్లో ఉండాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ? ( )
A) అందరు పల్లెల్లో ఉండకూడదు
B) అందరు పల్లెల్లో ఉండకపోవచ్చు
C) కొందరు పల్లెల్లో ఉండకూడదు
D) కొందరు పల్లెల్లో ఉండాలి
18. ఇవన్నీ నాకు అద్భుత మనిపిస్తాయి – వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
A) ఇవన్నీ నాకు అద్భుతాలు కావు.
B) ఇవన్నీ నాకు అద్భుతాలు అనిపించడం లేదు.
C) ఇవన్నీ నాకు అద్భుతాలు అనిపించవు.
D) ఇవన్నీ అద్భుతాలు కావని నాకనిపిస్తుంది.
19. పల్లెలో వర్షం కురిసింది – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?
A) పల్లెల్లో వర్షం తప్పక కురవకూడదు
B) పల్లెల్లో వర్షం కురవలేదు
C) పల్లెల్లో వర్షం కురవాలి
D) పల్లెల్లో వర్షం కురవకపోవచ్చు