20. మురళి జాబు రాశాడు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?
A) మురళి జాబు వ్రాయించుకొనెను
B) మురళి జాబు వ్రాసుకొనలేదు
C) జాబు వ్రాయించుకొనలేదు ఎవరితోను మురళి
D) మురళి జాబు రాయలేదు
21. రైతులు నాట్లు వేశారు – పంటలు పండలేదు దీనికి సంయుక వాక్యం ఏది ?
A) రైతులు నాట్లు వేయడంతో పంటలు పండలేదు
B) రైతులు నాట్లు వేశారుగాని పంటలు పండలేదు.
C) పంటలు పండక పోవడానికి కారణం నాట్లు వేయడమే
D) నాట్లు రైతులు వేయకపోవడంతో పంటలు పండలేదు
22. వర్షాలు కురిశాయి చెరువులు నిండలేదు – దీనికి సంయుక్త ఆ వాక్యం, గుర్తించండి. ( )
A) వర్షాలు కురవడం వల్ల చెరువులు నిండలేదు
B) చెరువులు నిండడం కోసం వర్షం రావాలి
C) చెరువులు నిండాయిగాని ‘వర్షాలు రాలేదు
D) వర్షాలు కురిశాయిగాని చెరువులు నిండలేదు
23. ‘నువ్వు’ నూరేళ్ళు వర్ధిల్లు’ – ఇది ఏరకమైన వాక్యము ?
A) అనుమత్యర్థక వాక్యం
B) ప్రార్థనాద్యర్థక వాక్యం
C) ఆశీర్వాద్యర్థక వాక్యం
D) సామర్థ్యార్థక వాక్యం
24. ‘గోపాల్ చెట్టు ఎక్కగలడు’ – ఇది ఏరకమైన సామాన్య వాక్యము ?
A) సామర్థ్యార్థక వాక్యం
B) శత్రర్థక వాక్యం
C) ప్రార్థనాద్యర్థక వాక్యం
D) సందేహార్థక వాక్యం