4. “పల్లెటూళ్ళు పచ్చదనానికి నిలయాలు” (దీనికి వ్యతిరేక వాక్యం గుర్తించండి.)
A) పల్లెటూళ్ళు పచ్చదనానికి నిలయాలు
B) పల్లెటూళ్ళు ఎండిపోయాయి
C) పల్లెటూళ్ళలో మాత్రమే పచ్చదనం ఉండదు
D) పల్లెటూళ్ళు పచ్చదనానికి నిలయాలు కావు
5. “నీయెడ దోసంగుల్లేని భావించితిన్” ఇది ఏ వాక్యం ? ( )
A) ప్రత్యక్ష కథనం
B) పరోక్ష కథనం
C) కర్తరి వాక్యం
D) కర్మణి వాక్యం
6. “వివేకం లేని రాజును సేవించడం కంటే వనవాసం మంచిది” ఇది ఏ వాక్యం ?
A) గ్రాంథికం
B) పదం
C) గద్యం
D) వ్యవహారికం
7. “రాముడు ‘విభీషణుని రక్షించెను” – ఇది ఏ వాక్యం ? ( )
A) కర్తరి వాక్యం
B) కర్మణి వాక్యం
C) ప్రత్యక్షం
D) పరోక్షం
8. గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది. సంక్లిష్ట వాక్యం గుర్తించండి.
A) గీత బజారుకు వెళ్ళి, గీత కూరగాయలు కొన్నది
B) గీత వెళ్ళి, కూరగాయలు కొన్నది
C) గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది
D) గీత బజారుకు వెళ్ళి, గీత కూరగాయలు