3. అతిశయోక్తి అలంకార లక్షణం గుర్తించండి. ( )
A) ఉపమేయానికి, ఉపమానానికి భేదం లేనట్లు చెప్పడం
B) హల్లుల జంట అర్థభేదంతో చెప్పడం
C) ఒక వస్తువును లేదా విషయాన్ని ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెప్పడం
D) ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం
4. తరాలు మారినా అంతరాలు తరగలేదు – ఈ వాక్యంలోని అలంకారం ఏది ?
A) వృత్త్యనుప్రాస
B) యమకము
C) అంత్యానుప్రాస
D) రూపకము
5. వాక్య పరిజ్ఞానం
1. కట్టలు కట్టుకొని దూసుకొని పోవలె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) దూసుకొని వెళ్ళవలె కట్టలు కట్టుకొని
B) కట్టలు కట్టి దూసుకుపోవలెను
C) కట్టలు కట్టుకొని దూసుకొని వెళ్ళవలె
D) కట్టలు కట్టుకొని దూసుకొని పోవాలి
2. అనుసరించుటకు సమాయత్తము కావలెను – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) సమాయత్తంబు కావలెను అనుసరించుటకు
B) అనుసరించడానికి సమాయత్తం కావాలి
C) సమాయత్తంబు కావలె అనుసరించుటకు
D) సమాయత్తము కావలెను అనుసరించుటకు
3. ‘నీ విషయాన్ని పరిశీలిస్తారు’ – కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
A) నీ విషయాన్ని పరిశీలించగలము
B) నీ విషయం పరిశీలింపబడుతుంది
C) నీ విషయం పరిశీలింపరు
D) నీది పరిశీలింపవలసిన విషయం కాదు