19. “రేపు వాడు బడికి వెడుతున్నాడు ?” – ఈ వాక్యానికి వ్యతిరేక వాక్యం ఏది ? ( )
A) రేపు వాడు బడికి వెళ్ళగలడు
B) రేపు వాడు బడికి రాడు
C) రేపు వాడు బడికి వస్తాడు
D) రేపు వాడు బడికి వెళ్ళడు
20. మంత్రాలకు చింతకాయలు రాలవు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?
A) మంత్రాలకు రాలవు చింతకాయలతో
B) మంత్రాలకు చింతకాయలు రాలతాయి
C) మంత్రాలకు చింతకాయలు రాలవచ్చు
D) మంత్రాలకు చింతకాయలు రాలలేకపోవచ్చు
21. మానవుడిని శాశ్వతం చేస్తాయి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
A) మానవుడిని శాశ్వతం చేయవు
B) మానవునిచే శాశ్వతం చేయబడవు
C) మానవుడివల్ల శాశ్వతం లభించకపోవచ్చు
D) శాశ్వతం వల్ల మానవుడు గొప్పవాడయ్యాడు
22. నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు – సంయుక్త వాక్యం ఏదో గుర్తించండి.
A) నమాజు చదవరు
B) నమాజు చదవడానికి ఎవరూరారు
C) నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, పోతుంటారు.
D) నమాజు చదవడానికి ఎవ్వరూ రారు, ఎవ్వరూ పోరు.
23. తిరుమల రామచంద్రగారు సంస్కృత భాషలో పండితుడు. తిరుమల రామచంద్రగారు ఆంధ్రభాషలో పండితుడు – సంయుక్త వాక్యం ఏదో ‘గుర్తించండి.
A) తిరుమల రామచంద్రగారు తెలుగు పండితుడు
B) మంచి పండితుడు తిరుమల రామచంద్రగారు సంస్కృతంలో పండితుడు.
C) తిరుమల రామచంద్రగారు సంస్కృతం, ఆంధ్ర భాషలలో పండితుడు.
D) తిరుమల రామచంద్రగారు సంస్కృత పండితుడు మరియు తెలుగు పండితుడు.