6. వలదీ దానము గీనముం బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా ! – ఇది ఏ పద్యపాదం ? ( )
A) చంపకమాల
B) మత్తేభం
C) ఉత్పలమాల
D) తేటగీతి
5. వాక్య పరిజ్ఞానం
1. పోతనచేత భాగవతం రచింపబడెను. – ఇది ఏ రకమైన వాక్యం ?
A) తద్ధర్మార్థక వాక్యం
B) కర్తరి వాక్యం
C) అభ్యర్థక వాక్యం
D) కర్మణి వాక్యం
2. తాను దానం చేస్తానని బలి చెప్పాడు. ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) భావార్థకం
B) పరోక్షకథనం
C) ప్రత్యక్షకథనం
D) క్త్వార్థం
3. బలి నీరు పోసాడు. బలి దానం చేసాడు. దీన్ని సంక్లిష్ట వాక్యంగా మారిస్తే ? ( )
A) బలినీరు, నందు దానం చేసాడు
B) బలి నీరు వలన దానం చేసాడు
C) బలి దానం చేసి నీరు పోసాడు
D) బలి నీరు పోసి దానం చేసాడు
4. దానం చేయాలి. కీర్తి పొందాలి. – దీన్ని సంక్లిష్ట వాక్యంగా మారిస్తే ? ( )
A) దానం కొరకు కీర్తి కావాలి
B) దానము నందు కీర్తి కలదు
C) దానం చేసి కీర్తి పొందాలి
D) దానంతో కీర్తి పొందవచ్చు