5. సజ్జన సహవాసం జగతికి మేలు చేకూర్చు – దీనికి ఆధునిక వాక్యాన్ని గుర్తించండి.
A) మేలు కలుగున సజ్జన సంగతి జగతికి
B) జగతిలో మేలు కలుగు సజ్జన సంగతి
C) సజ్జన సంగతి మేలు చేకూరదు జగతికి
D) సజ్జన సహవాసంతో జగతికి మేలు కలుగుతుంది
6. రామకృష్ణారావు గారు ఆమోదముద్ర వేశారు – ఇది ఏ వాక్యం ?
A) కర్తరి వాక్యం
B) కర్మణి వాక్యం
C) చేదర్థకం
D) సామాన్య వాక్యం
7. మానవుడు విలువలు పాటించాడు – దీనికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
A) పాటించాలి మానవుడు నైతిక విలువలు
B) మానవునిచే విలువలు పాటించబడ్డాయి
C) విలువలచే మానవుడు పాటించబడ్డాయి
D) విలువల వల్ల మానవుడు వృద్ధి పొందాడు
8. దాత దానం చేశాడు – దీనికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
A) దాత వల్ల దానం పొందబడెను
B) పొందబడింది దానం దాతవల్ల
C) దాతచే దానం చేయబడింది
D) చేయబడింది దాతతో దానం
9. రామదాసు రాముని సేవించాడు – దీనికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
A) రాముని సేవించాడు రామదాసుతో
B) రామదాసు చేత రాముడు సేవించబడినాడు
C) రాముడు సేవించబడినాడు రామదాసు వల్ల
D) రామదాసుతో సేవించబడినాడు రాముడు