10. లక్ష్మణకవి సుభాషితాలను అనువదించాడు. దీనికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
A). అనువదింపబడినాయి లక్ష్మణకవి వల్ల సుభాషితాలు
B) సుభాషితాలతో అనువదింపబడినాయి లక్ష్మణకవి
C) లక్ష్మణకవి వలన సుభాషితాలు అనువాదానికి లోనైనాయి
D) లక్ష్మణకవిచే సుభాషితాలు అనువదింపబడినాయి
11. రేఖామాత్రంగా నా భావాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి – ఈ వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చండి. ( )
A) రేఖామాత్రంగానే నా భావాలు ఇక్కడ పొందుపరచాను
B) నా భావాలు రేఖామాత్రంగానే ఇక్కడ పొందుపరచాను
C) రేఖామాత్రంగా నా భావాలు పొందుపరచబడెను
D) నా భావాలు రేఖామాత్రంగా పొందుపరచబడెను
12. ‘నాకు హితము కావాలి’ అని రచయిత అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) వారికి హితము అవసరమని రచయిత అన్నాడు
B) తనకు హితము కావాలని రచయిత అన్నాడు
C) తనకు కావలెను హితంబు అని రచయిత అన్నాడు
D) వానికి రచయిత అన్నాడు హితంబు అని
13. “నాకు సజ్జన మైత్రి ఇష్టం” అని రవి అన్నాడు – దీనికి పరోక్ష కథనం ఏమి ?
A) రవికి సజ్జనమైత్రి అవసరమని చెప్పాడు
B) తనకు సజ్జనమైత్రి ఇష్టమని రవి అన్నాడు
C) అతనికి సజ్జనమైత్రి అవసరమని రవి అన్నాడు
D) వానికి సజ్జనమైత్రి తప్పక అవసరమని అన్నాడు
14. “నాతో గుడికి రావద్దు” – అని లత చెప్పింది – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) గుడికి ఆమెతో రాకూడదని లత చెప్పింది
B) తనతో గుడికి రావద్దని లత చెప్పింది.
C) గుడికి ఆమెతో రావద్దని లత చెప్పింది
D) లత నాతో రావద్దని గుడికి అని చెప్పింది