45. మీరు ఊరునుంచి ఎప్పుడు వచ్చారు. – ఇది ఏ వాక్యం ?
A) సందేహార్థకం
B) విధ్యర్థకం
C) ప్రశ్నార్థకం
D) పైవేవీకావు
46. మీకు విజయం కలుగుగాక. – ఇది ఏ వాక్యం ?
A) సంభావనార్థకం
B) ఆశీర్వాద్యర్థకం
C) విధ్యర్థకం
D) సందేహార్థకం
47. ఈరోజు ఆట జరుగుతుందో, జరగదో ! – ఇది ఏ వాక్యం ?
A) విధ్యర్థకం
B) ప్రశ్నార్థకం
C) సంభావనార్థకం
D) సందేహార్థకం
48. రమ చక్కగా పాడగలదు. – ఇది ఏ వాక్యం ? ( )
A) అనుమత్యర్థకం
B) విధ్యర్థకం
C) సామర్థ్యార్ధకం
D) ప్రేరణార్థకం
49. మా పాఠశాలకు రేపు మంత్రిగారు రావచ్చు. – ఇది ఏ వాక్యం ?
A) సందేహారకం
B) ప్రశ్నార్థకం
C) అనుమత్యర్థకం
D) సంభావనార్థకం