4. శ్రీకాంత్ చొక్కా మల్లెపూవులా తెల్లగా ఉంది – అలంకారం గుర్తించండి.
A) ఉత్ప్రేక్షాలంకారం
B) శ్లేషాలంకారం
C) ఉపమాలంకారం
D) రూపకాలంకారం
5. కింది వానిలో శ్లేషాలంకార లక్షణం గుర్తించండి.
A) నానార్థాలను కలిగి ఉండే అలంకారం
B) ఉపమేయానికి, ఉపమానానికి భేదం లేనట్లు చెప్పడం
C) హల్లుల జంట అర్ధభేదంతో చెప్పడం
D) ఒక వస్తువును లేదా విషయాన్ని ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెప్పడం
6. కింది వానిలో ఉపమాలంకార లక్షణం గుర్తించండి.( )
A) హల్లుల జంట, అర్థభేదంతో వెంట వెంటనే ప్రయోగిస్తే
B) ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే
C) ఉపమాన ఉపమేయములకు అభేదాన్ని చెప్పడమే
D) ఒక వస్తువును గాని, విషయాన్ని ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెప్పటాన్ని
5. వాక్య పరిజ్ఞానం
1. నేనియ్యడంగల చోద్యంబులు రేపు గల్గొనియెదన్. అనే గ్రాంథిక భాషలోని వాక్యాన్ని ఆధునిక వచనంలోనికి మార్చితే,
A) నేను ఇక్కడ ఉన్న వింతలను రేపు కనుక్కొంటాను.
B) నేను ఇయ్యెడన కల చోద్యంబుల్ రేపు కనుకొనెదన్
C) నేన్ ఈయెడన్ కల వింతలు రేపు చూస్తాను.
D) నేనియ్యెడన్ ఉన్న వింతలు రేపు చూచెదన్
2. ‘అన్నము రవి చేత తినబడింది’ – అనే కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చితే,
A), అన్నము రవిచేత తినెను
B) రవి అన్నము తినెను
C) అన్నముచే రవి తినబడినాడు ,
D) అన్నమును రవి తినలేదు