3. “నా దినం తీరుతుంది బాబూ” అని నాతో చెప్పాడు. అని ప్రత్యక్ష కథనంలో నున్న వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చితే,
A) నాదినం తీరదు బాబూ అని తనతో చెప్పాడు.
B) తనదినం తీరదు బాబూ అని నాతో చెప్పాడు.
C) తనదినం తీరదు బాబూ అని తనతో చెప్పలేదు.
D) తన దినం తీరుతుంది బాబూ అని నాతో చెప్పాడు.
4. “చంద్రమతి వేషం ప్రథమంగా నేను ధరించవలసి వచ్చింది” అన్నారు స్థానంవారు. అని ప్రత్యక్ష కథనంలోనున్న వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చితే
A) చంద్రమతి వేషం ప్రథమంగా తాను ధరించవలసి వచ్చిందని స్థానం వారు అన్నారు.
B) చంద్రమతి వేషం ద్వితీయంగా తాను ధరించవలసి వచ్చిందని స్థానం వారు అన్నారు.
C) చంద్రమతి వేషం ప్రథమంగా తాను ధరించవలసి వచ్చిందని స్థానం వారు అనలేదు.
D) చంద్రమతి వేషం ప్రథమంగా నేనే ధరించవలసి వచ్చిందని స్థానం వారు అనలేదు.
5. సమాజంలో భద్రత ఉంది-దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
A) సమాజంలో భద్రత లేకపోవచ్చు
B) సమాజంలో భద్రత ఉండాలి
C) సమాజంలో భద్రత ఉండి తీరాలి
D) సమాజంలో భద్రత లేదు
6. భావన వచ్చింది. పావని వచ్చింది. సంయుక్త వాక్యాన్ని గుర్తించండి. :
A) భావన, పావని వచ్చారు
B) పావని వచ్చి భావన వచ్చింది
C) పావని భావన వచ్చింది
D) భావన రాలేదు పావని వచ్చింది
7. ‘విజయుడవై తిరిగిరా’ – ఇది ఏరకమైన వాక్యం ?
A) సందేహార్థకం
B) ప్రశ్నార్థకం
C) ఆశీర్వాదార్థకం
D) భావార్థకం