8. బాగా చదివి నిద్రపోయాడు-గీత గీసిన పదం ఏ క్రియా పదం.?
A) అప్యర్థకం
B) హేత్వర్ణకం
C) తద్ధర్మార్థకం
D) క్త్వార్థం
9. తెలుగులోనే మాట్లాడండని, తెలుగులోనే రాయండని టీవీ లలో మంత్రిగారు చెప్పారు – ఇది ఏ వాక్యం ? ( )
A) ప్రత్యక్ష కథనం
B) పరోక్ష కథనం
C) కర్మణి వాక్యం
D) కర్తరి వాక్యం
10. “సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి” అని మేథావులు నిర్ణయించారు. ( )
A) పరోక్ష వాక్యం
B) కర్మణి వాక్యం
C) కర్తరి వాక్యం
D) ప్రత్యక్ష వాక్యం
11. “సంఘసంస్కర్తలు దురాచారాలను ఖండించారు. సంఘసంస్కర్తలు ఉద్యమాలు నడిపించారు.” , సంక్లిష్ట వాక్యంలోకి మార్చండి.
A) సంఘసంస్కర్తలు దురాచారాలను, ఉద్యమాలను ఖండించారు.
B) సంఘసంస్కర్తలు దురాచారాలను, ఉద్యమాలను నడిపించారు.
C) సంఘసంస్కర్తలు దురాచారాలను ఖండించి, ఉద్యమాలను నడిపారు.
D) సంఘసంస్కర్తలు ఉద్యమాలు నడిపారు మరియు దురాచారాలను ఖండించారు.
9. జీవనభాష్యం (డా|| సి. నారాయణ రెడ్డి)
PAPER – II : PART-B
1. సంధులు
1. “పైరవుతుంది” ఏ సంధి ?”
A) ఇకారసంధి
B) ఉకారసంధి
C) త్రికసంధి
D) యణాదేశసంధి