3. ‘బాలవ్యాకరణము’ చిన్నయసూరి చేత రచింపబడెను’ – అనే కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చితే, ( )
A) బాలవ్యాకరణము చిన్నయసూరి రాయలేదు.
B) చిన్నయసూరి బాలవ్యాకరణము రచించెను.
C) చిన్నయసూరి రచించాడు బాలవ్యాకరణమును.
D) బాలవ్యాకరణము చిన్నయసూరిచే రాయబడలేదు.
4. ‘అది నాచే రచింపబడినది’ – అనే కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చితే,
A) అది నేను రచింపబడినది
B) నేను దాన్ని రచించలేదు
C) దాన్ని నేను రచించాను
D) అది నాచే రచింపబడలేదు
5. ‘కవులచే వ్యర్థపదాలు వాడబడినవి’ అనే కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చితే
A) కవులు వ్యర్థపదాలను వాడారు.
B) కవులు వ్యర్థపదాలను వాడలేదు.
C) వ్యర్థపదాలను వాడారు కవులు
D) వ్యర్థపదాలు కవులతో వాడబడ్డాయి.
6. మాకు హనుమంతుడంటే ఇష్టం అని రవి అన్నాడు – దీనికి పరోక్ష కథనం ఏమిటి ? ( )
A) వానికి హనుమంతుడంటే ఇష్టంగా చెప్పమన్నాడు
B) హనుమంతునికి ఇష్టంగా చెప్పుకున్నాడు రవి
C) హనుమంతుని వల్ల ఇష్టంబుగా చెప్పుకున్నాడు
D) తనకు హనుమంతుడంటే ఇష్టమని రవి అన్నాడు
7. “నేను కఠినుడనని అందరూ అంటారు. నిజానికి నేను చాలా శాంతస్వభావం కలవాడిని” అని తనను గురించి చెప్పుకున్నాడు’ అని ప్రత్యక్ష కథనంలో నున్న వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చితే..
A) నేను కఠినుడనని అందరూ అంటారని నిజానికి తాను చాలా శాంత స్వభావం కలవాడినని ఆయన గురించి తనకు చెప్పుకున్నాడు.
B) నేను కఠినుడను కానని అందరూ అంటారని నిజానికి అందాలని తనను తాను చాలా శాంతస్వభావం లేనివాడినని తనను గురించి చెప్పుకున్నాడు.
C) తాను కఠినుడనను కానని అందరు అనరని నిజానికి నేను చాలా శాంత స్వభావం కలవాడిని కానని ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు.
D) తాను కఠినుడనని అందరూ అంటారని, నిజానికి తాను చాలా శాంత స్వభావం కలవాడినని ఆయన తనను గురించి తాను చెప్పుకున్నాడు.