8. “మన చిత్ర కళాపిపాస గోడల మీద రంగుల క్యాలెండర్లు తీరుస్తున్నాయి” అని వారన్నారు. అనే ప్రత్యక్ష కథనంలో నున్న వాక్యాన్ని పరోక్ష కథనంలోనికి మార్చితే. ( )
A) తమ చిత్ర కళాపిపాస గోడల మీద రంగుల క్యాలెండర్లు తీరుస్తున్నాయని వారన్నారు.
B) మా చిత్ర కళాపిపాస గోడల మీద రంగుల క్యాలెండర్లు తీరుస్తున్నాయని వారన్నారు.
C) మీ చిత్ర కళాపిపాస గోడల మీద రంగుల క్యాలెండర్లు తీరుస్తున్నాయని వారనలేదు.
D) తమ చిత్ర కళాపిపాస గోడల మీద రంగుల క్యాలెండర్లు తీరుస్తున్నాయని వీరన్నారు.
9. “నాకు తిరుగు లేదు” అని హనుమంతుడు అన్నాడు – దీనికి పరోక్ష కథనం ఏది ?
A) వారికి తిరుగులేదని హనుమంతుడు చెప్పవలెను ‘
B) తనకు తిరుగులేదని హనుమంతుడన్నాడు
C) అతనికి తిరుగులేదని హనుమంతుడన్నాడు
D) హనుమంతుడే తనకు తిరుగుండాలని చెప్పుకున్నాడు
10. “నేను రామభక్తుడిని” అని హనుమంతుడు చెప్పాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి. ( )
A) తాను రామభక్తుడినని హనుమంతుడు చెప్పాడు.
B) ఆయన రామభక్తుడేనని చెప్పుకున్నాడు హనుమంతుడు.
C) వానికి రామునిపై రామభక్తి ఎక్కువని చెప్పుకున్నాడు.
D) రామునికి తనపై భక్తియని హనుమంతుడు చెప్పాడు.
11. హనుమంతుడు బలవంతుడు, కీర్తివంతుడు – దీనికి సంయుక్త వాక్యం గుర్తించండి.
A) హనుమంతుడు బలవంతుడు కావాలి, కీర్తివంతుడు కావాలి
B) హనుమంతుడు బలవంతుడు మరియు కీర్తివంతుడు
C) హనుమంతుడు బలవంతుడైనందువల్ల కీర్తివంతుడు
D) హనుమంతుడు కీర్తివంతుడై, బలవంతుడై ఉండాలి
12. అతడు పాట పాడి బహుమతులందుకొనెను. ఇది ఏరకమైన వాక్యం ?
A) సంయుక్త వాక్యం
B) కర్మణి వాక్యం
C) శత్రర్థక వాక్యం
D) సంక్లిష్ట వాక్యం