2. రాజు కువలయానందకరుడు – అలంకారం గుర్తించండి.
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష.
C) రూపకం
D) శ్లేషాలంకారం
3. హిమాలయ పర్వతాలు ఆకాశాన్ని తాకుతున్నాయి : అలంకారం గుర్తించండి.
A) శ్లేషాలంకారం
B) ఉపమాలంకారం
C) ఉత్ప్రేక్ష
D) అతిశయోక్తి
4. జింకలు బిత్తరి చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున దూకుతున్నాయి – ఏ అలంకారం ? ( )
A) స్వభావోక్తి
B) ఉపమా
C) రూపకం
D) ఉత్ప్రేక్ష
5. వాక్య పరిజ్ఞానం
1. వృద్ధుడు ఆశ్రమంబున నుండె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) వృద్ధుడు ఆశ్రమంలో ఉన్నాడు
B) ఉండెను ఆశ్రమంబున వృద్ధుడు
C) వృద్దునిచే ఆశ్రమంబున నుండె
D) ఆశ్రమంబుననుండె వృద్ధుడు
2. విద్యార్థి వృద్ధునికి నమస్కరించె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) విద్యార్థి వినయంబున నమస్కరించే వృద్ధునికి
B) విద్యార్థి వృద్ధునికి నమస్కరించాడు
C) నమస్కరించే విద్యార్థి వృద్ధునికి
D) వృద్ధునిచే నమస్కరించబడియె విద్యార్థి