13. ముగ్గురు రచయిత్రులచే ‘పీఠిక’ వ్రాయబడింది. దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) ముగ్గురు రచయిత్రులూ పీఠిక రాయలేదు.
B) పీఠిక ముగ్గురు రచయిత్రులచే రాయబడింది
C) పీఠికను ముగ్గురు రచయిత్రులు వ్రాశారు
D) పీఠిక ముగ్గురు రచయిత్రులు రాసేశారు
14. ‘నాకు గురుభక్తి ఎక్కువ’ అని రవి అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) వానికి గురుభక్తి ఎక్కువగా రవి చెప్పాడు
B) తనకు గురుభక్తి ఎక్కువని రవి అన్నాడు
C) వానికి గురుభక్తి అధికంబని రవి చెప్పాడు
D) అతని యందు గురుభక్తి ఎక్కువని చెప్పాడు
15. ‘అందరూ చదవాలి’ అని ప్రభుత్వం చెప్పింది – దీనికి పరోక్ష కథనం గుర్తించండి. ( )
A) అందరిచే చదువబడెనని ప్రభుత్వం చెప్పింది
B) అందరిని చదవాలని ప్రభుత్వం చెప్పింది
C) అందరు చదవాలని ప్రభుత్వం చెప్పింది
D) ప్రభుత్వం చెప్పడం వల్ల అందరు చదివారని చెప్పారు
16. “నాకు ఆనందం కలిగింది అని బాలుడు అన్నాడు. – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) తనకు ఆనందం కలిగిందని బాలుడు అన్నాడు
B) తనకు ఆనందం కలగాలని బాలుడు చెప్పాడు
C) తనకు ఆనందం కలుగవచ్చు బాలుడు అన్నాడు
D) బాలుడు తనకు ఆనందం కలుగవచ్చునని చెప్పాడు
17. “నాకు కన్నీళ్ళు వచ్చాయి” అని విద్యార్థి అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) వానికి కన్నీళ్ళు వచ్చాయని విద్యార్థి అన్నాడు
B) తనకు కన్నీళ్ళు వచ్చాయని విద్యార్థి చెప్పుకున్నాడు
C) తనకు కన్నీళ్ళు వచ్చాయని విద్యార్థి అన్నాడు
D) కన్నీళ్ళు నేను పెట్టుకున్నానని విద్యార్థి అన్నాడు