Current Affairs Telugu September 2024 For All Competitive Exams

106) భారతదేశంలో రక్షణ సామర్ధ్యాలను పెంపొందించే లక్ష్యంతో C – 130J సూపర్ హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ ని ఈ క్రింది ఏ రెండు సంస్థలు సంయుక్తంగా తయారు చేయనున్నాయి ?

A) రిలయన్స్ & దస్సాల్ట్ ఏవియేషన్
B) అదానీ & లాక్ హీడ్ మార్టిన్
C) టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ( TASL)& లాక్ హిడ్ మార్టిన్
D) టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ( TASL) & దస్సాల్ట్ ఏవియేషన్

View Answer
C) టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ( TASL)& లాక్ హిడ్ మార్టిన్

107) వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2023-24 లో ప్రధాన వ్యవసాయ పంటల తుది అంచనాల ప్రకారం 168.74 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడితో దేశంలోనే తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ?

A) ఉత్తరప్రదేశ్
B) తెలంగాణ
C) పశ్చిమబెంగాల్
D) ఛత్తీస్ ఘడ్

View Answer
B) తెలంగాణ

108) ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ ( PM – AASHA) పథకం ద్వారా నూనె గింజలు, చిరు ధాన్యాల పంటలకి మద్దతు ధరలని రైతులకు అందిస్తారు. కాగా ఈ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?

A) 2021
B) 2018
C) 2022
D) 2020

View Answer
B) 2018

109) ఇటీవల 30 కోట్ల రిజిస్ట్రేషన్లు దాటిన ” e – శ్రమ్ పోర్టల్ ” ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

A) మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్
B) మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్
C) మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్
D) మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్

View Answer
B) మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్

110) వృక్షశాస్త్ర పరిశోధకులు ఇటీవల ఏ రాష్ట్రంలో కొత్త జాతి మొక్కలైన Curcuma ungmensis మొక్కలను కనుగొన్నారు ?

A) నాగాలాండ్
B) అస్సాం
C) మిజోరాం
D) త్రిపుర

View Answer
A) నాగాలాండ్

Spread the love

Leave a Comment

Solve : *
39 ⁄ 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!