86. క్రింది వాటిలో ప్రకృతి వైపరీత్యం ఏది?
1. కరువు
2. యుద్ధం
3. ఉగ్రవాదం
4. పైవన్నీ
87. ఒక సమాజం యొక్క మౌలిక నిర్మాణానికి మరియు సాధారణ పనితీరుకు అంతరాయం కలిగించే ఆకస్మిక లేదా తీవ్ర దురదృష్టాన్ని విపత్తు అంటారు (The occurance of a sudden or major misfortune which distrupts the basic fabric and normal functioning of a society(or community) is known as ‘disaster). ఈ నిర్వచనాన్ని ఇచ్చినది ఎవరు?
1. ఐక్యరాజ్య సమితి
2. ప్రపంచబ్యాంకు
3. జాతీయ విపత్తు ప్రాధికార సంస్థ
4. పైవన్న
88. విరూపారక(tectonic) విపత్తుకు ఉదాహరణ ఏది?
1. హిమ సంవాతాలు
2. చక్రవాతాలు
3. భూకంపాలు
4. వరదలు
89. కమ్యూనిటీ విపత్తుకు గురయ్యే సున్నితత్వాన్ని లేదా ఘటనలకు ప్రతిస్పందే సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే భౌతిక, సామాజిక ఆర్థిక మరియు/లేదా రాజకీయ కారకాలచే కూర్చబడ్డ ప్రాబల్యంలో ఉన్న లేదా పర్యవసాన పరిస్థితుల సమూహాన్ని ఏమంటారు?
1. సునామి
2. దుర్బలత్వం
3. విపత్తు
4. వైపరీత్యం
90. క్రింది వాటిలో నాలుగు రకాల విపత్తులు (కరువు, వరదలు, చక్రవాతం, భూకంపం) ఎదుర్కొనే రాష్ట్రం ఏది?
1. ఉత్తర ప్రదేశ్
2. పశ్చిమ బెంగాల్
3. ఆంధ్రప్రదేశ్
4. ఒడిషా