131. విపత్తు సంభవించిన ప్రదేశాలకు సరుకులు, సేవలను తరలించే పరిస్థితి కానిది ఏది?
1. అసాధారణ వాతావరణ పరిస్థితలు, వేడి, చలి, తడి మొదలగునవి
2. నివసించడానికి, పని చేయడానికి వీలులేని గుంపులతో కూడిన, కిక్కిరిసిన పరిస్థితి
3. భద్రతకు ముప్పు కలిగి ఉండటం
4. విధి నిర్వహణకు స్పష్టమైన విభజన ఉండటం
132. విపత్తు నిర్వహణలో మీడియా క్రింది వాటిలో ఒకటి మినహా అన్ని పాత్రలను పోషిసొస్తుంది?
1. విపత్తు వార్తలను అందించడం ద్వారా ప్రజల సానుభూతిని కూడగట్టును
2. సహాయక చర్యలను అందించడంలో ఎదురయ్యే అడ్డంకులను తొలిగించు
3. వీరును గుర్తించును
4. విపత్తుకు కారణమైన వాటిని లేదా ప్రతిస్పందనలో వైఫల్యానికి సంబంధించి నిందను మోపడానికి ప్రయత్నించును
133. భోపాల్ విషాదంలో విడుదలైన విష వాయువులు ఎంత మంది ప్రాణాలను హరించెను?
1. 2800
2. 3598
3. 2500
4. 3000
134. భోపాల్ రసాయన వాయు విపత్తు ఏ కంపెనీలో సంభవించెను?
1. ఇండియన్ ఆయిల్ & గ్యాసు డిపో
2. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
3. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ
4. నెరోలాక్ కెమికల్ ఫ్యాక్టరీ
135. కేంద్రక సంలీన చర్య ద్వారా పెద్ద మొత్తంలో శక్తిని విడుదల చేసే అణ్వాయుధం
1. అణు బాంబు
2. విచ్ఛిత్తి బాంబు
3. హైడ్రోజన్ బాంబు
4. ఏదీ కాదు