151. విమానం అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ప్రయాణికులను పరుండమని చెప్పడానికి కారణం
1. వారిని ఎవరూ నెట్టకుండా ఉండటానికి
2. వారిని సీట్ల క్రింద దాక్కుని ఉండమనడానికి
3. పొగ పైకి వెళుతుంది కాబట్టి
4. గాజు కిటికీలకు దూరంగా ఉండాలని చెప్పడానికి
152. భారత వాతావరణ శాఖ దీనికి బాధ్యత వహించును?
1. చక్రవాతాలను పసిగట్టడం
2. పౌరులను విపత్తుకు సన్నద్ధం చేయడం
3. తుఫాను హెచ్చరికలు
4. చక్రవాతాలను పసిగట్టడం మరియు తుఫాను హెచ్చరికలు
153. భారత ఉపఖండం ప్రపంచంలోకెల్లా అత్యంత తీవ్రమైన చక్ర వాత విపత్తు ముప్పు కలిగి ఉండటానికి కారణం
1. ఎత్తయిన పర్వతాలు ఉండటం
2. శక్తివంతమైన రుతు పవనాలు
3. మహా సముద్ర సంస్తరం తక్కువ లోతు కలిగి ఉండటం
4. భారీ పరిమాణంలో నీరు ఉండటం
154. సైక్లోన్ పదం సైక్లోస్ అనే గ్రీకు భాష నుండి ఉద్భవించింది. అయితే సైక్లోస్ అంటే అర్థం
1. సైక్లోన్
2. పాము మెలికలు
3. వర్తులాకారం
4. దిగువ
155. పసిఫిక్ మహాసముద్రంలో సైక్లోన్లను ఏమందురు?
1. టోర్నడోలు
2. విల్లు విల్లీలు
3. హారికేన్
4. టైఫూన్లు