221. ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని ఎక్కువగా భయపెడుతున్న విపత్తు
1. భూకంపం
2. భూతాపం
3. కరువు
4. యుద్ధాలు
222. సాంకేతిక పరిజ్ఞానం నేడు వైపరీత్యాలను గుర్తించి, ఒక ప్రాంతంపై దాని ప్రభావాన్ని అంచనా వేయ గలదు. దీని వలన ప్రయోజనం..
1. ఖాళీ చేయు మార్గాలను రూపొందించుకోవచ్చు
2. ప్రభుత్వ సహాయం, పర్యవేక్షణ కేంద్రాల ఏర్పాటుకు దోహదపడును
3. విపత్తును నివారించవచ్చు లేదా దాని ప్రభావాన్ని కుదించవచ్చు
4. విపత్తులు సంభవించిన వెంటనే ప్రతిస్పందించవచ్చు
223. ముందస్తు విపత్తు ప్రణాళిక దీనిని సాధ్యము చేయును?
1. నివారణ సాధ్యం కాని చోట సహాయాన్ని ప్రభావవంతంగా అమలు చేయడం
2. సహజవైపరీత్యాలను ఎదుర్కొనడంలో స్వయం సామర్థ్యం
3. విపత్తు పర్యవసానాలను ముందుగానే అడ్డుకోవచ్చు
4. పైవన్నీ
224. ప్రభావశీలమైన వైపరీత్య నిర్వహణ ప్రధానముగా దీనిపై ఆధారపడును?
1. వాలంటీర్లు
2. ప్రభుత్వ సంస్థలు
3. ఎమర్జన్సీ రెస్పాన్స్
4. ముందస్తు విపత్తు నిర్వహణ ప్రణాళిక
225. ప్రతి విపత్తు భిన్నమైన కారణం కలిగి ఉన్నప్పటికీ, అవన్నీ క్రింది అంశాలలో ఊహించదగ్గ సమస్యలకు కారణమగును
1. పర్యావరణ మరియు ఆరోగ్య
2. పాలన మరియు నిర్వహణ పరమైన
3. సామాజిక మరియు ఆర్థిక
4. పైవన్నీ