251. సామాజిక ఆధారిత విపత్తు కుదింపు నిర్వహణ కార్యక్రమాన్ని ఏ సంస్థ సహాయంతో నిర్వహిస్తున్నారు?
1. యు ఎన్ డిపి
2. ఐఎంఎఫ్
3. ప్రపంచ బ్యాంకు
4. యూనిసెఫ్
252. జనాభాలో ఒక వ్యాధి పెరుగుదల దీనిని సూచించును?
1. పేలవమైన పారిశుధ్య పరిస్థితిని
2. కరువు వలన తలెత్తే వలసల కారణంగా తప్పని పరిస్థితిని
3. నీటి కొరత వలన సంభవించే ప్రాథమిక ఫలితాన్ని
4. కరువు ద్వితీయ ఫలితమైన పౌష్టికాహార లోపాన్ని
253. దీర్ఘ కాలిక కరువు సామాజిక మరియు జీవన పద్దతులు ఎటువంటి మార్పులకు కారణమగును?
1. తాత్కాలిక
2. భారీ పర్యావరణ
3. శాశ్వత
4. స్వల్ప
254. దుర్భిక్షం దీని వలన సంభవించును?
1. రిఫ్రిజిరేషన్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వలన
2. ఊహించని కారణాల వలన
3. కరువు వలన
4. కీటక దాడుల వలన పంట ధ్వంసం కావడం
255. దుర్భిక్ష బాధితులకు సాధారణ ఆహార రేషన్ పంపిణీ విధానం
1. ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా ఒకే ప్రక్రియ అమల్లో ఉండును
2. ఐక్యరాజ్యసమితి రూపొందించిన ఆదేశాలను అనుసరించును
3. పెద్ద ఎత్తున నిల్వ మరియు పంపిణీ నెట్వర్కులు అవసరమగును
4. ప్రదేశము, స్థానిక కారకాలను బట్టి మారుతుండును