106. వరి రకాలకు సంబంధించి సరైన సమితి
(1) హంస, ఫల్గున, కవి
(2) జయ, మసూరి, సొనార – 63
(3) బాస్మతి, హంస, పూసా మోతి
(4) రవి, ఫల్గున, ధార్వార్ అమెరికన్
107. ఒక పొలములో ”అజొటొబాక్టర్ బాక్టీరియా’ సంవృద్ధిగా ఉన్నది. ఈ నేల వీటిని కలిగియున్నదని ఇది సూచించేది
(1) పొటాష్, సోడియం
(2) జింక్, బోరాన్
(3) నైట్రేటులు, నైట్రైటులు
(4) ఇనుము, మాంగనీసు
108. వెలుగు నిండిన బస్సులో రాత్రి సమయంలో ప్రయాణించు నప్పుడు బయటి వస్తువులు, దృశ్యాలను చూడలేము. కాని కాంతిని తీసివేసినప్పుడు బయటి వాటిని చూడగలము దీనికి కారణమైన కంటి భాగము
(1) అశ్రు గ్రంధులు
(2) తారక, కనుపాప
(3) కంటిపొం
(4) కంటి కటకము
109. కింది వాక్యములను పరిగణించండి,
A. రక్తము ఆక్సిజన్ ను మాత్రమే రవాణా చేస్తుంది.
B. రక్తము శరీరములోని వివిధ భాగాల నుండి కార్బన్ డయాక్సైడ్ ను ఊపిరితిత్తులకు రవాణా చేస్తుంది
C. రక్తము వ్యాధులను కలుగచేసే క్రిములనుండి శరీరాన్ని రక్షించడంలో తోడ్పడుతుంది.
D. రక్తము శరీరభాగాల నుండి వ్యర్ధ పదార్థాలను మూత్రపిండాలకి, చర్మానికి చేరవేస్తుంది
పై వాక్యములలో సరియైనది కానిది/వి.
(1) B, C మాత్రమే
(2) C మాత్రమే
(3) A మాత్రమే
(4) A, D మాత్రమే
110. ఒక మత్స్య ప్రజనన కారుడు తాసుకోరుకున్న చేపల నుండి. ఏ కాలములోనైనా అండాలు, శుక్రకణాలను పొందడానికై వాటికి ఒక హార్మోనును ఇంజెక్ట్ చేను. అతడు ఉపయోగించిన హార్మోను. దీనినుంచి సేకరీంచబడినది
(1) పిట్యూటరీ గ్రంధి
(2) స్త్రీబీజ కోశము
(3) ముష్కము
(4) అవటు గ్రంధి