126. దక్షిణాఫ్రికాలో సామ్రాజ్యవాద, జాత్యాహంకార వ్యతిరేక పోరాటాన్ని బలపరిచిన అలీన రాజ్యాల శిఖరాగ్ర సమావేశం
(1) న్యూఢిల్లీ సమావేశం
(2) హరారే సమావేశం
(3) బెల్ గ్రేడ్ సమావేశం
(4) హవానా సమావేశం
127. బి.టెక్ 2 వ సం|| చదువుతున్న ఒక విద్యార్థి తన ఫీజు రీఎంబర్స్మెంటు సమస్య గురించి ప్రభుత్వంకు ఒక పిటీషన్ ను పెట్టుకున్నాడు. విద్యార్థి ఈ రకమైన హక్కును ఉపయోగించుకున్నాడు.
(1) సహజ హక్కు
(2) నైతిక హక్కు
(3) పౌర హక్కు
(4) రాజకీయ హక్కు
128. తలసరి వాస్తవ ఆదాయమును కనుగొనుటకు సూత్రము
(1) తలసరి వాస్తవ ఆదాయము = జాతీయాదాయము/జనాభా
(2) తలసరి వాస్తవ ఆదాయము = స్థిరధరలలో జాతీయాదాయము/జనాభా
(3) తలసరి వాస్తవ ఆదాయము = స్థూల జాతీయోత్పత్తి/జనాభా
(4) తలసరి వాస్తవ ఆదాయము = పన్నుల ద్వారా వచ్చు ఆదాయం/జనాభా
129. ఒక కంపెనీలో జపాన్ యొక్క ఈక్విటి 70% మరియు ఇండియా ఈక్విటి 30% ఐన. ఆ కంపెనీ ఈ రంగంలోనికి వస్తుంది.
(1) పబ్లిక్ రంగు
(2) ప్రైవేటు రంగం
(3) విదేశీ రంగం
(4) మిశ్రమ రంగం
130. ఆంధ్ర ప్రదేశ్ ఆదాయపు వాటా ఎక్కువగా ఈ రంగం లేదా రంగాల నుండి లభిస్తుంది.
(1) ప్రాథమిక రంగం
(2) ద్వితీయ రంగం
(3) తృతీయ రంగం
(4) ప్రాథమిక, ద్వితీయ రంగం