PART-8
TEACHING METHODOLOGY – TELUGU
131. నటరాజు ‘ఢమరుక’ శబ్దం నుంచి ఆవిర్భవించిన మాహేశ్వర సూత్రాల సంఖ్య
(1) పన్నెండు
(2) పదహారు
(3) పదునాలుగు
(4) పద్దెనమిది
132. వర్ణమాలలో తరచుగా రాని అక్షరాలను తీసివేసి మిగిలిన వాటిని మొదట నేర్పడాన్ని ఇలా పిలుస్తారు.
(1) పద పద్ధతి
(2) ప్రాచీనాక్షర పద్ధతి
(3) నవీనాక్షర పద్ధతి
(4) వాక్య పద్ధతి
133. వ్యాకరణ బోధనలో ‘ప్రదర్శన’ సోపానము నందు మొదటి ఉప సోపానము
(1) అంశ సేకరణ
(2) అంశ వివరణ
(3) ఉన్ముఖీకరణము
(4) సూత్రీకరణము
134. ఉప వాచకము నందలి భాషా స్థాయి. ఈ విధంగా ఉండాలి
(1) విద్యార్థులు చదువుతున్న తరగతి కంటే కింది తరగతి స్థాయిలో ఉండాలి
(2) విద్యార్థులు చదువుతున్న తరగతి కంటే పై తరగతి స్థాయిలో ఉండాలి
(3) విద్యార్థులు చదువుతున్న తరగతి కంటే కింది స్థాయిలో కాని, చదువుతున్న తరగతి స్థాయిలో సైనా ఉండాలి
(4) విద్యార్థులు చదువుతున్న తరగతి కంటే పై స్థాయిలో కాని, చదువుతున్న తరగతి స్థాయిలో సైనా ఉండాలి
135. బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయులు వినియోగించే దృశ్య బోధనోపకరణాలు ఇవి
(1) రేడియో, పాఠ్యపుస్తకాలు, టెలివిజన్
(2) వార్తాపత్రికలు, సెల్ ఫోన్, టేప్ రికార్డు
(3) రేడియో, గోడపత్రిక, మెరుపుఆటలు
(4) పాఠ్యపుస్తకాలు, వార్తాపత్రికలు, గోడపత్రిక