146. ఈ క్రింది వానిలో బహుళైచ్ఛిక ప్రశ్నల తయారీకి సంబంధము లేని నియమము
(1) ఇచ్చిన ప్రశ్నకు ఒకే సరైన జవాబు ఉండాలి
(2) ప్రశ్న మూలము స్పష్టంగా ఉండాలి
(3) అన్ని ప్రత్యామ్నాయ జవాబులు సంభవనీయంగా ఉండాలి
(4) ప్రశ్నల ప్రత్యామ్నాయ జవాబులు సంఖ్య సమానంగా ఉండకూడదు
147. గణితములో ప్రయోగశాల పెద్దతి యొక్క ఒక ప్రయోజనము
(1) అన్ని పాఠ్యాంశాల బోధనకు వర్తిస్తుంది
(2) ఉపాధ్యాయునికి భారం తగ్గుతుంది
(3) కృత్యం ద్వారా అభ్యసన జరుగుతుంది
(4) బోధనకు తక్కువ సమయం పడుతుంది.
148. “కాలమానం” అనే సాధ్యమమును బోధించులుకు నీవు ఎంచుకునే ప్రభావవంతమైన బోధనోపకరణం
(1) ప్లాష్ కార్డులు
(2) పనిచేయు నమూనాలు
(3) పెగ్ బోర్డు
(4) నల్లబల్ల
PART-11
TEACHING METHODOLOGY – SCIENCE
149. విజ్ఞాన శాస్త్ర నిర్వచనాన్ని బట్టి, విద్యార్థి విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని ఇలా అవగాహన చేసికొంటాడు.
శాస్త్రం =
A) పద్ధతులు + జ్ఞానం
B) ప్రక్రియ + ఫలితం
C) జ్ఞానం + జ్ఞానం సముపార్జించే మార్గం
D) శాస్త్రీయ పద్ధతి + శాస్త్రీయ అభిరుచి + శాస్త్రీయ కార్యము
పై వానిలో సరికాని దానిని గుర్తించండి.
(1) A)
(2) B)
(3) C)
(4) D)
150. విజ్ఞాన శాస్త్రం విద్యార్థులకు ఈ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది. అది వారిలో సమస్యల నిష్పాక్షిక పరిశీలన, మానసిక ఏకాగ్రత, క్రమబద్ధమైన ఆలోచనా సరం, ఓర్పు, సరియైన నిర్ణయాలు చేయడుం, నిశిత పరిశీలన వంటి కొన్ని సుగుణాలను పెంపొందిస్తుంది. దీనికి కారణమైన పద్ధతి, విలువను గుర్తించండి.
(1) అన్వేషణా పద్ధతి మరియు సృజనాత్మక విలువ
(2) ప్రకల్పనా పద్ధతి మరియు సాంఘిక విలువ
(3) సమస్యా పరిష్కార పద్ధతి మరియు నైతిక విలువ
(4) శాస్త్రీయ పద్ధతి మరియు క్రమశిక్షణా విలువ