31. 1944 నాటి సార్జంట్ నివేదిక, ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది
(1) దేశీయ విద్య
(2) ఉన్నత విద్య
(3) యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక
(4) సెకండరీ విద్య
32. కింది వానిలో ఒక దానిని ‘జాతీయ విద్యా ప్రణాళికా చట్టం, 2005’ నొక్కి చెబుతున్నది.
(1) ప్రపంచీకరణ దృష్ట్యా స్థానిక జ్ఞానానికి విలువ లేదు
(2) స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది.
(3) ఆంగ్ల పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యత నివ్వాలి
(4) సమాచార, భావ ప్రసార సాంకేతిక పరిజ్ఞానాన్ని (ICT), ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులకు తప్పనిసరి
33. విద్యాహక్కు చట్టం – 2009 ఈ నాటి నుండి అమలు లోకి వచ్చింది
(1) మార్చి 1, 2010
(2) ఏప్రిల్ 2, 2009
(3) ఏప్రిల్ 1, 2010
(4) మార్చి 10, 2009
34. ఈ కింది రాజ్యాంగ కల్పన ద్వారా అల్పసంఖ్యాకులు, విద్యా సంస్థలను స్థాపించు కొనుట మరియు నిర్వహించు కొనుటకు హక్కు కల్పించబడింది.
(1) 29 వ అధికరణం
(2) 28 వ అధికరణం
(3) 45 వ అధికరణం
(4) 30 వ అధికరణం
35. జాతీయ విద్యా ప్రణాళికా చట్రం, 2005 ప్రకారం విద్యా ప్రణాళికలో కొత్త పాఠ్యవిషయాలు (సబ్జేక్టలు) ను ఇలా చేర్చ వచ్చును.
(1) ఒక ప్రత్యేక విషయంగా
(2) ప్రస్తుతమున్న విషయాలు, నిర్వహిస్తున్న కృత్యల ద్వారా
(3) ప్రస్తుతమున్న విషయాలలో కాని లేదా ఆ విషయాల ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకొని ప్రత్యేక విషయంగా కాని
(4) ముందటి విషయ ప్రణాళిక (సిలబస్)ను విద్యార్థులు పూర్తి చేసినట్లయితే