Economy Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu

Q)క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనవి?
1. భారత ప్రభుత్వపు విదేశీ మారక నిధులు 1979-80లో 7 బిలియన్ డాలర్ల నుంచి జనవరి, 1991 నాటికి 600 మిలియన్ డాలర్లకు పడిపోయింది
2. 1979-80లో భారతదేశ విదేశీ రుణం 18 బిలియన్ డాలర్లు ఉండగా 1991 నాటికి 90 బిలియన్ డాలర్లుకు చేరింది.
సరియైన సమాధానం

A)1 మరియు 2 రెండూ సరైనవి
B)1 మాత్రమే సరైనది
C)2 మాత్రమే సరైనది
D)1 మరియు 2 సరైనవి కాదు

View Answer
C)2 మాత్రమే సరైనది

Q)పదకొండవ ప్రణాళిక అంతానికి వరి, గోధుమ మరియు పప్పు ధాన్యాల ఉత్పత్తిలో వరుసగా 10,8 మరియు 2 మిలియన్ టన్నుల పెరుగుదల సాధనకు ఉద్దేశింపబడిన పథకం ఏది?

A)భారత్ నిర్మాణ పథకం
B)ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన
C)జాతీయ ఆహార భద్రత మిషన్
D)నేషనల్ మిషన్ ఫర్ సప్లైనెబుల్ అగ్రికల్చర్

View Answer
C)జాతీయ ఆహార భద్రత మిషన్

Q)బిజినెస్ కరస్పాండెంట్స్ వద్ద ఉన్న మైక్రో -(ATM) ల ద్వారా ఆధార్తో యుక్తమైన చెల్లింపు విధానం (AEPS) ను ఉపయోగించి దిగువ తెలిపిన సేవలలో దేనిని వినియోగించుటకు వీలుకాదు?

A)నగదు ఉపసంహరణ
B)నగదు జమ
C)డిమాండ్ డ్రాఫ్ట్
D)నిధుల బదిలీ

View Answer
C)డిమాండ్ డ్రాఫ్ట్

Q)మూలధన జారీలో రెండు భాగాలు అనగా వాటాలు, డిబెంచర్లు ఉంటాయి. వీటికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను చదువుము.
1. వాటాదారులందరూ కంపెనీలో ఎలాంటి యాజమాన్యాన్ని కలిగి ఉండరు.
2. వాటాలన్నియు కేవలం మార్పిడి చేయుటకు వీలుకాని రుణాల రూపంలో ఉండి స్థిర వడ్డీని ఆర్జిస్తాయి
3. డిబెంచర్లను కలిగిన వారందరు కంపెనీల యాజమాన్యంలో ఎలాంటి వాటాను కలిగి ఉండరు.
4 డిబెంచంలన్నియు కేవలం రుణాల రూపంలో ఉండి స్థిరమైన వడ్డీని ఆర్తిస్తాయి.
పై వాటిలో ఏది/ఏవి సరియైనది కాదు?

A)3 మరియు 4 మాత్రమే
B)3 మరియు 4 మాత్రమే
C)1 మరియు 3మాత్రమే
D)1 మరియు 2 మాత్రమే

View Answer
D)1 మరియు 2 మాత్రమే

Q)క్రింది వ్యాఖ్యలను చదవండి
1. పెద్దతరహా శాంపిల్ సర్వేలను నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు (NSSO) నిర్వహిస్తుంది.
2.1975లో ప్రతిపాదించిన 20 అంశాల పథకం, 1982, 1986 . మరియు 2006లో సవరించబడినది.
3.కేంద్ర గణాంకాల కమీషన్ (National Statistical Commission) యొక్క పూర్తిస్థాయి మార్గదర్శకం మరియు పర్యవేక్షణలో నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు స్వయం ప్రతిపత్తితో విధులను నిర్వహించును.
సరియైన సమాధానం

A)1 మరియు 2 మాత్రమే సరైనవి
B)2 మరియు 3 మాత్రనే సరైనవి
C)1 మరియు 3మాత్రమే సరైనవి
D)1,2మరియు 3 సరైనవి

View Answer
D)1,2మరియు 3 సరైనవి
Spread the love

Leave a Comment

Solve : *
25 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!