Q)దిగువ తెలిపిన పరిశ్రమలలో ఏది ఏవి వ్యవసాయాధిరిత పరిశ్రమ కాదు?
1.వస్త్ర పరిశ్రమ
2. పంచదార పరిశ్రమ
3. పేపర్ పరిశ్రమ
4. అటోమొబైల్ పరిశ్రమ
సరియైన సమాధానం
A)1 మరియు 2 మాత్రమే
B)3 మరియు 4 మాత్రమే
C)4 మాత్రమే
D)3 మాత్రమే
Q)జతపరుచుము .
జాబితా-1 (ఆర్థిక విధానం) | జాబితా-2 (ఉద్దేశం) |
A)భారతీయ నూతన దివాళా కోడ్ (IBC)సాధన | 1)ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరులో పెరుగుదల సాధన |
B)రీ కాపిటరలైజేషన్ ప్యాకేజి | 2)కార్పోరేట్ సంస్థలకు వాటి ఆస్తి అప్పుల పట్టికలలో సర్దుబాటు, రుణాలలో తగ్గుదలకు సహకారం. |
C)డిమానెటైజేషన్ మరియు వస్తు సేవల పన్ను | 3)ప్రభుత్వరంగ బ్యాంకు ఆస్తి, అప్పుల పట్టికలను బలోపేతం చేయడం |
D)ఇంద్ర ధనుష్ | 4)పన్ను చెల్లింపుదారుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల |
1.A-2, B-4, C-1, D-3
2.A-1, B-2, C-3, D-4
3.A-2, B-3, C-4, D-1
4.A-1, B-2, C-4, D-3
Q)భారతదేశ జనాభాలో 53.3 శాతం (64.2 కోట్ల మంది) బహుళరూప పేదరికం Multi Dinensjonal తో బాధపడుచున్నారని దిగువ వాటిలో ఏ అధ్యయనం తెలియపరిచింది?
A)ప్రణాళికా సంఘ నివేదిక-1998
B)మానవ అభివృద్ధి నేవిదిక – 2016
C)టెండూల్కర్ కమిటీ నేవదిక – 2009
D)రంగరాజన్ కమిటీ నివేదిక – 2014
Q)కింద తెలిపిన పరిశ్రమలలో ఏ పరిశ్రమ తప్పనిసరి లైసెన్సింగ్ నుంచి మినహాయించబడలేదు?
A)పెయింట్ మరియు అనుబంధ వస్తువులు
B)సిగరెట్ పరిశ్రమ
C)గ్లాస్/గాజు పరిశ్రమ
D)కాగిత పరిశ్రమ
Q)ప్రతిపాదన (A) : పారిశ్రామిక రుగ్మతకు గురైన చిన్న తరహా పారిశ్రామిక యూనిట్లు రుణాలను/బకాయిలను ఏక మొత్తంగా పరిష్కరించుటకు సంబంధించినది SAMADHAN పథకం
కారణం (R) : పారిశ్రామిక రుగ్మతకు లోనయిన పరిశ్రమలు వాటి రుణాలను అసలుతోపాటు వడ్డీని రెండింతలకు మించకుండా ఒకేసారి చెల్లించాలి.
సరియైన సమాధానం
A)(A) మరియు (R) రెండూ సరియైనవి మరియు (R) (A) కు సరియైన వివరణ అవుతుంది
B)(A) మరియు (R) రెండూ సరియైనవి కాని (R) కు (A)సరియైన వివరణ కాదు.
C)(A) సరియైనది, కాని R సరియైనది కాదు
D)(A) సరియైనది కాదు, R సరియైనది.
Q)దిగువ తెలిపిన వాటిలో దేని గురించి అధ్యయనం చేసి సూచనలు ఇవ్వడానికి భారత రిజర్వ్ బ్యాంకు Y.H. మాలేగాం అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది?
A)ప్రధానమంత్రి జన్ దన్ యోజన
B)జన్ ధన్, ఆధార్ మొబైల్
C)స్వయం సహాయక బృందాలు – బ్యాంకు అనుబంధాలు
D)సూక్ష్మపరపతి రంగం’