Q)క్రింది ప్రవచనములో ఏది/ఏవి నిజం?
1. మానవులలో ఎర్ర రక్తకణాలు కేంద్రాన్ని కల్గి యుండవు
2.AB రక్త వర్గం కలిగిన వారు ఎవరికైనా రక్తదానం చేయవచ్చు
3. హిపారిన్ రక్తం గడ్డ కట్టడానికి దోహదపడుతుంది.
A)1 మరియు 2
B)2 మరియు 3
C)1 మరియు 3
D)1 మాత్రమే
Q)బాక్టీరియాలు అతి సూక్ష్మమైన జీవులు అయితే మనం కంటితో చూడగలిగిన బాక్టీరియా ఒకటి ఉన్నది. దానిని క్రింది వాటి నుంచి గుర్తించండి.
A)కోర్ని బాక్టీరియమ్ రెనెలే
B)ఆగ్రో బాక్టీరియమ్ టుమిఫేసియెన్స్
C)కాస్ట్రేడియం పాశ్చరియానమ్
D)థయోమార్గరిట నమీబియన్ సిస్
Q)క్రింది మొక్కల పేర్లను వాటి జాతులతో జతపరుచుము.
జాబితా-1(మొక్కలు) | జాబితా-2(జాతులు) |
A)రావల్ఫియా | 1) ఔషధ జాతి |
B)పార్టీనియం (వయ్యారి భామ) | 2)ఆపదలో ఉన్న జాతి |
C)జట్రోపా (అడవి ఆముదం) | 3)ఆక్రమణ జాతి |
D)రక్త చందనం | 4)జీవ ఇంధన మొక్క |
1.A-2, B-3, C-1, D-4
2.A-2, B-4, C-3, D-1
3.A-3, B-4, C-1, D-2
4.A-2, B-3, C-4, D-1
Q)క్రింది ప్రవచనాలను చదవండి
1. సీసం (lead)లాంటి కాలుష్యాలు ఆహారపు గొలుసులోని ఒక పోషక స్థాయి నుండి తరువాత పోషక స్థాయిలో చేరి సాంద్రీకృతం అయ్యే విధానాన్ని బయోఅక్యుమలేషన్ అంటారు.
2. ఉప్పునీటి (marine) ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తీదారుల జీవద్రవ్యరాశి ప్రథమ వినియోగదారుల జీవ ద్రవ్యరాశి కంటే తక్కువ.
3. ఒక పోషక స్థాయి నుండి తర్వాతి పోషక స్థాయికి శక్తి ప్రసారం జరిగేటప్పుడు కొంత శక్తి వృధా అవుతుంది.
పై ప్రవచనాలలో ఏది/ఏవి సరియైనవి?
A)1 మరియు 2
B)2 మరియు 3
C)1 మరియు 3
D)3 మాత్రమే
Q)భూగోళ తాపం (గ్లోబల్ వార్నింగ్) అనేది సమకాలీన పర్యావరణ సమస్య. ఈ సమస్యకు దోహదపడే వాయువుల సమూహము
A)మిథేన్, నైట్రోజన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్
B)మీథేన్, హైడ్రోజన్, నైట్రోజన్
C)మీథేన్, నైట్రోజన్ డై ఆక్సైడ్, ఓజోన్
D)నైట్రోజన్ డై ఆక్సైడ్, హైడ్రోజన్, ఆక్సిజన్