Q)క్రింది పదార్థాలలో విలక్షణమైన స్వభావము ప్రదర్శించు ఫెర్రో ఆయస్కాంత పదార్ధ మేది?
A)మాంగనీస్
B)అల్యూమినియం
C)బిస్మత్
D)ఇనుము
Q)ఒక నిర్దిష్టమైన దిశలో వస్తువు ప్రయాణించిన అతి తక్కువ దూరం
A)వడి
B)స్థాన భ్రంశము
C)వేగము
D)త్వరణం
Q)ఒక విద్యుద్వలయంలో విద్యుత్ ప్యూజ్ వాడకం వల్ల కలిగే ప్రయోజనము
A)విద్యుద్వలయాన్ని మూయుటకు లేదా తెరచుటకు
B)విద్యుద్వలయాన్ని అధిక విద్యుత్ ప్రవాహాల నుండి రక్షించుటకు
C)విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మార్చుటకు
D)వలయంలో విద్యుచ్ఛక్తి వినియోగము తగ్గించుటకు
Q)మంచు కరుగుతున్నప్పుడు దాని ఉష్ణోగ్రత
A)స్థిరంగా ఉంటుంది.
B)పెరుగుతుంది.
C)తగ్గుతుంది
D)మొదట తగ్గి తరువాత పెరుగుతుంది
Q)ప్రవచనము (A): వెండి మరియు రాగి ఉత్తమ విద్యుద్వాహకాలు
ప్రవచనము (B): గాజు మరియు రబ్బరు విద్యుత్ బంధకాలు
సరియైన సమాధానము
A)(A) సరియైనది కాని (B) సరియైనది కాదు.
B)(A) మరియు (B) సరియైనవి.
C)(A) సరియైనది కాదు కాని (B) సరియైనది.
D)(A) మరియు (B) సరియైనవి కావు.