Q)కాంకర్' వ్యాధి వల్ల నిమ్మ పండ్ల నాణ్యత బాగా దెబ్బతింటుంది. నిమ్మ తోటలు పెంచే వ్యవసాయదారులు ఈ వ్యాధి వల్ల ఆర్థికంగా బాగా నష్టపోతారు. ఈ వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి ఏది?
A)వైరస్
B)బాక్టీరియా
C)శిలీంధ్రం
D)నిమటోడ్
Q)'అత్తిపత్తి' ఆకులను ముట్టుకొన్నప్పుడు జరిగే చలనం క్రింది వాటిలో దేనికి ఉదాహరణ?
A)అనుకుంచిత చలనం
B)అనువర్తన చలనం
C)అనుచలనం
D)నర్కేడియన్ రిథమ్
Q)ప్రతిపాదన (A) : పండడం కోసం పచ్చి మామిడికాయ లుంచిన బుట్టలో పూర్తిగా పండిన ఒక మామిడికాయను ఉంచితే, ఆ బుట్టలోని అన్ని కాయలు త్వరితగతిన పండుతాయి.
కారణం(R) : పూర్తిగా పండిన మామిడికాయ నుండి విడుదల అయ్యే ఎథిలీన్ మిగిలిన కాయలలో ఎఫిలిన్ ఉత్పత్తిని ప్రేరేపింపచేసే పక్వతను 'త్వరితగతం చేస్తుంది.
సరియైన సమాధానం
A)(A) మరియు (R) రెండూ సరియైనవి. మరియు (A)కు (R) సరియైన వివరణ
B)(A) మరియు (R) రెండూ సరియైనవి కాని (A) కు (R) సరియైన వివరణ కాదు.
C)(A) సరియైనది, కాని (R) సరియైనది కాదు.
D)(A) సరియైనది కాదు, కాని (R) సరియైనది.
Q)క్రింది ప్రవచనాలను చదవండి
1. తీపి బఠాణీ మొక్కలో మెండెల్ ప్రయోగాలలో ఏక సంకరణ జన్యు 1 రూప నిష్పత్తి 1:2:1
2. చిన్న జనాభాలో జన్యు పౌనఃపున్యంలోని మార్పులను 'జన్యు విస్థాపనం' అంటారు.
3. జనకుల నుండి లక్షణాలు సంతతికి అందించబడటాన్ని 'అనువంశికత' అంటారు.
పై ప్రవచనములలో ఏది/ఏవి నిజం?
A)1 మరియు 3
B)2 మరియు 3
C)1 మాత్రమే.
D)1,2 మరియు 3
Q)“ప్రపంచీకరణ ప్రక్రియ” కు ప్రధాన కారణము
A)సందేశాత్మక సినిమాలు
B)వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం
C)ధనికులు మరియు పేదవారికి మధ్య ఉన్న అంతర్యం
D)రాజకీయ పార్టీలు